జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

మరో టీడీపీ నేత అరెస్ట్ అయ్యారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్‌ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. 154 వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించినట్టు వీరిపై అభియోగం. అనంతపురం, తాడిపత్రి పోలీస్ స్టేషన్ లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటికే 27 కేసులు నమోదు అయ్యాయి. అందులో 24 కేసులు నకిలీ రిజిస్ట్రేషన్ లకు సంబంధించినవే. బీఎస్‌ […]

Advertisement
Update:2020-06-13 02:03 IST

మరో టీడీపీ నేత అరెస్ట్ అయ్యారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్‌ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. 154 వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించినట్టు వీరిపై అభియోగం.

అనంతపురం, తాడిపత్రి పోలీస్ స్టేషన్ లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటికే 27 కేసులు నమోదు అయ్యాయి. అందులో 24 కేసులు నకిలీ రిజిస్ట్రేషన్ లకు సంబంధించినవే. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించారన్న దానిపై కేసులు నమోదు అయ్యాయి. పాత బీఎస్ ‌ 3 వాహనాలను నకిలీ పత్రాల సాయంతో కొత్త వాహనాలుగా రిజిస్ట్రేషన్లు చేయించినట్టు గుర్తించారు.

నకిలీ పత్రాల సాయంతో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇప్పటికే 60 వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. మరో 94 వాహనాలను జేసీ బ్రదర్స్ దాచిపెట్టారని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని లారీలను బస్సులుగా మార్చి నడుపుతున్నట్టు గుర్తించి కేసు నమోదు చేశారు.

154 వాహనాలకు ఫేక్ ఇన్సూరెన్స్‌లను రూపొందించినట్టు రవాణాశాఖ అధికారులు గుర్తించినట్టు ఏపీ రవాణా శాఖ కమిషనర్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు వెల్లడించారు. రవాణా శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు.

Tags:    
Advertisement

Similar News