అచ్చెన్న అరెస్ట్‌పై షాక్‌కు గురిచేసిన బాబు స్పందన

ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 7గంటల 20నిమిషాలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని సొంత ఇంటి వద్ద అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్‌పై చంద్రబాబు స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. అచ్చెన్నాయుడిని కిడ్నాప్‌ చేశారంటూ చంద్రబాబు ఆరోపించారు. అంతటితో ఆగకుండా అచ్చెన్నాయుడు కిడ్నాప్‌కు బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలంటూ మరో విచిత్రమైన డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు ఆచూకీ చెప్పాలని డీజీపీని డిమాండ్ చేశారు. 300 […]

Advertisement
Update:2020-06-12 05:48 IST

ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 7గంటల 20నిమిషాలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని సొంత ఇంటి వద్ద అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్‌పై చంద్రబాబు స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. అచ్చెన్నాయుడిని కిడ్నాప్‌ చేశారంటూ చంద్రబాబు ఆరోపించారు.

అంతటితో ఆగకుండా అచ్చెన్నాయుడు కిడ్నాప్‌కు బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలంటూ మరో విచిత్రమైన డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు ఆచూకీ చెప్పాలని డీజీపీని డిమాండ్ చేశారు. 300 మంది పోలీసులు వెళ్లి అచ్చెన్నాయుడుపై దాడి చేశారంటూ ఆరోపించారు. ఇది బీసీలపై దాడి అని కుల ప్రస్తావన తెచ్చారు.

అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణల్లో పస లేదని కొద్ది సేపటికే తెలిసిపోయింది. ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తున్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. అరెస్ట్ సమయంలో వారి నుంచి లేఖ రూపంలో ఆమోదం కూడా తీసుకున్నారు. అన్ని చానళ్లలో కూడా ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తున్నారని ప్రసారం చేశాయి.

చంద్రబాబు మాత్రం అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారంటూ హడావుడి చేశారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర స్పష్టంగా ఉందని తేలిన తర్వాతే తాము అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో ప్రకటించారు. 150 కోట్లు కాజేశారని… అందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అందుకే అరెస్ట్ చేశామని… ఇందులో రాజకీయాలకు అవకాశం లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News