లాక్‌డౌన్‌లో లాభాలు పెంచుకున్న బిస్కెట్ కంపెనీ

పార్లే-జీకి పెరిగిన అమ్మకాలు కరోనా లాక్‌డౌన్ కాలంలో అన్ని రకాల వ్యాపారాలు బంద్ అయ్యాయి. కేవలం నిత్యావసర సరుకులు, కిరాణా దుకాణాలు మాత్రమే తెరిచిపెట్టారు. బేకరీలు, స్వీట్ షాపులు కూడా మూసేయడంతో ప్రజలు కిరాణా దుకాణాల్లో దొరికే చిరుతిండ్లనే కొనుక్కుని తిన్నారు. గత కొన్నాళ్లుగా అమ్మకాలు లేక పలు యూనిట్లను మూసేసిన పార్లే-జీ బిస్కెట్ కంపెనీ లాక్‌డౌన్ కాలంలో లాభాలను గడించింది. కరోనా నేపథ్యంలో అనేక కంపెనీలు నష్టాలను చూస్తుండగా, నిత్యావసర విభాగంలో ఉన్న పార్లె-జీ కంపెనీకి […]

Advertisement
Update:2020-06-10 02:00 IST
లాక్‌డౌన్‌లో లాభాలు పెంచుకున్న బిస్కెట్ కంపెనీ
  • whatsapp icon
  • పార్లే-జీకి పెరిగిన అమ్మకాలు

కరోనా లాక్‌డౌన్ కాలంలో అన్ని రకాల వ్యాపారాలు బంద్ అయ్యాయి. కేవలం నిత్యావసర సరుకులు, కిరాణా దుకాణాలు మాత్రమే తెరిచిపెట్టారు. బేకరీలు, స్వీట్ షాపులు కూడా మూసేయడంతో ప్రజలు కిరాణా దుకాణాల్లో దొరికే చిరుతిండ్లనే కొనుక్కుని తిన్నారు.

గత కొన్నాళ్లుగా అమ్మకాలు లేక పలు యూనిట్లను మూసేసిన పార్లే-జీ బిస్కెట్ కంపెనీ లాక్‌డౌన్ కాలంలో లాభాలను గడించింది. కరోనా నేపథ్యంలో అనేక కంపెనీలు నష్టాలను చూస్తుండగా, నిత్యావసర విభాగంలో ఉన్న పార్లె-జీ కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి.

కరొనా ముందు మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీ బ్రాండ్ల నుంచి వ్యాపార యుద్దం కొనసాగడమే కాకుండా.. అమ్మకాల విషయంలో అనేక ఒడిదుడుకులను పార్లే జీ ఎదుర్కుంది. కానీ.. ఒకే సారి కిరాణా దుకాణాల్లో పార్లే బిస్కెట్లను కొనే వారి సంఖ్య పెరగడంతో లాభాల బాట పట్టింది.

కంపెనీ స్థాపించిన తర్వాత 1938 నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదని యాజమాన్యం స్పష్టం చేసింది. గడిచిన 80 ఏళ్ల కాలంలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే భారీ స్థాయిలో పార్లె-జీ బిస్కెట్ల అమ్మకాలు నమోదయ్యాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

మరోవైపు కంపెనీ అమ్మకాలు పెరగడంతో దానికి స్టాక్ మార్కెట్లో షేర్ విలువ కూడా పెరుగుతోంది. ఇక బిస్కెట్ల వ్యాపారంలో గత రెండు నెలల్లోనే పార్లే కంపెనీ 5 శాతం వాటా చేజిక్కిచ్చుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా పార్లె-జీ బిస్కెట్ల ఉత్పత్తులను పెంచారు. తయారీ కేంద్రాల్లో సిబ్బంది కోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసి సరఫరా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన జాగ్రత్తలను కంపెనీ నిర్వహించింది.

లాక్‌డౌన్ వల్ల లక్షల్లో పేదలు ఆహారం దొరక్క ఇబ్బందులు పడ్డారు. వారికి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా పార్లె-జీ బిస్కెట్ల ధరలు ఉండటంతో వాటిని కొని తిన్నారు. అనేక స్వచ్చంద సంస్థలు పేదల కోసం పార్లె-జీ బిస్కెట్లను కొని పంచారు. లాక్‌డౌన్ వల్ల నడక మార్గంలో వెళ్లిన వలస కార్మికులు కూడా వీటినే కొని ఆకలి తీర్చుకున్నారు. రూ. 5 కే పార్లె-జీ బిస్కెట్లు లభిండం వల్ల చాలా మంది ఈ కంపెనీ బిస్కెట్లను కొన్నారు.

Tags:    
Advertisement

Similar News