తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

కరోనా టెస్టుల విషయంపై విచారణ అలసత్వంపై ఆగ్రహం వైద్యశాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ నమోదు చేస్తామని హెచ్చరిక కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పడుతూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం కరోనా ర్యాండమ్ టెస్టుల విషయంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. […]

Advertisement
Update:2020-06-08 15:42 IST
  • కరోనా టెస్టుల విషయంపై విచారణ
  • అలసత్వంపై ఆగ్రహం
  • వైద్యశాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ నమోదు చేస్తామని హెచ్చరిక

కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పడుతూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం కరోనా ర్యాండమ్ టెస్టుల విషయంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టక తప్పదని హెచ్చరించింది. ఇందుకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను కూడా బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17 లోగా పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయడంతో పాటు తదుపరి విచారణకు వీరిద్దరూ వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కరోనా ర్యాండమ్ టెస్టులను ఎందుకు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తగిన సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల సరఫరా లేనందువల్లనే వైద్యులకు కూడా కరోనా సోకి ఉండవచ్చని అభిప్రాయపడింది. ప్రతీరోజూ కరోనా కేసులకు సంబంధించి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం విడుదల చేస్తున్న బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఉంటున్నాయని, వాస్తవాలను దాచిపెడితే కరోనా తీవ్రత ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది.

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన వారి మృతదేహాలకు ఎందుకు కరోనా పరీక్షలు చేయట్లేదని.. ఇకపై మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ బదులిస్తూ.. దీనిపై సుప్రీంకోర్టులో తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశామని.. ఇంకా విచారణ జరగలేదని చెప్పారు.

అయితే విచారణ జరిగే వరకు తమ ఆదేశాలను అమలు చేయాలని హైకోర్టు చెప్పింది. ప్రతీ రోజు సరైన లెక్కలను మీడియా ద్వారానేకాకుండా ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. తప్పుడు లెక్కలు చెబుతున్నట్లు మరోసారి మా దృష్టికి వస్తే తీవ్ర చర్యలు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News