నీలం సాహ్ని పదవికాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవికాలం మరో మూడు నెలల పొడిగింపుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం నీలం సాహ్ని పదవికాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ ప్రభుత్వ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కరోనాపై పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో నీలం సాహ్నిని కొనసాగించాల్సిన అవసరం ఉందని… ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది.  ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. నీలం సాహ్ని పదవికాలం […]

Advertisement
Update:2020-06-03 10:35 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవికాలం మరో మూడు నెలల పొడిగింపుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం నీలం సాహ్ని పదవికాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ ప్రభుత్వ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

కరోనాపై పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో నీలం సాహ్నిని కొనసాగించాల్సిన అవసరం ఉందని… ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. నీలం సాహ్ని పదవికాలం మరో మూడు నెలలు పొడిగించింది. ఈనెలాఖరుకు నీలం సాహ్ని పదవీవిరమణ చేయాల్సి ఉంటుంది. తాజాగా పొడిగింపు కారణంగా ఆమె సెప్టెంబర్ 30 వరకు పదవిలో కొనసాగుతారు.

గతంలోనూ పలువురు సీఎస్‌ల పదవికాలాన్ని ఇలా పొడిగించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అప్పటి ఉమ్మడి ఏపీలో సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించారు.. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పీకే మహంతీ పదవీకాలాన్ని నాలుగు నెలల పాటు పొడిగించారు.

Advertisement

Similar News