వరవరరావును వెంటనే విడుదల చేయాలి... అనారోగ్యానికి కారణాలు చెప్పాలి...

విరసం నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పూణే పోలీసులు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన కుటుంబసభ్యులకు… ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనుమతి ఇచ్చారు. అయితే వరవరరావు అనారోగ్యానికి గురి కావడంపై ఆయన భార్య హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త […]

Advertisement
Update:2020-05-30 07:00 IST

విరసం నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పూణే పోలీసులు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన కుటుంబసభ్యులకు… ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనుమతి ఇచ్చారు.

అయితే వరవరరావు అనారోగ్యానికి గురి కావడంపై ఆయన భార్య హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త ఆరోగ్యంపై పోలీసులు, వైద్యుల నుంచి భిన్నమైన ప్రకటనలు వస్తున్నాయని ఆందోళన చెందారు. వరవరరావు మూడు రోజుల క్రితం నుంచే జైలు ఆస్పత్రిలో ఉన్నారని… ఆ తర్వాతనే జేజే ఆస్పత్రికి తరలించినట్టుగా జైలు అధికారులు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయని ఒక ప్రకటనలో ఆమె వివరించారు. ప్రస్తుతం వరవరరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తాము తెలుసుకునేందుకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని హేమలత విజ్ఞప్తి చేశారు.

అబద్దపు ఆరోపణలపై, విచారణ లేకుండానే 18 నెలలుగా నిర్భంధంలో వరవరరావును ఉంచారని… ఆయన్ను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జైలులో వరవరరావు కళ్లు తిరిగి కిందపడిపోవడమే నిజమైతే అందుకు కారణాలపై సమగ్ర వైద్య పరీక్షలు జరపాలని కోరారు. తన భర్తకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని… వాటిలో ఏ సమస్య తీవ్రంగా మారి, పరిస్థితి ఆందోళనాకరంగా మారిందో వైద్య బృందం పరీక్షించి చెప్పాలని కోరారు.

వరవరరావుతో పాటు ఆయన సహనిందితుల పట్ల ఎన్‌ఐఏ కక్షపూరిత వైఖరిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తెలుగువాడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ బిడ్డ వరవరరావు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని ముందుకు రావాలని హేమలత కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో వరవరరావును అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి తలోజా జైలుకు తీసుకొచ్చారు. వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడు దల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు సహజ, అనల, పవన మూడ్రోజుల క్రితం మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌ కి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖ రాశారు. తమ తండ్రిని చూసేందుకూ అనుమతినివ్వడం లేదని లేఖలో వారి దృష్టికి తెచ్చారు.

Release VV – Hemalatha

Tags:    
Advertisement

Similar News