సిద్దిపేట చుట్టూ అగ్రి బూమ్‌ !

సిద్ధిపేట. దీని చుట్టు పక్కల ప్రాంతాల్లో సాగు నీరు లేకుండా అల్లాడిపోయేది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతం చుట్టూ ఇప్పుడు రిజర్వాయర్లు వచ్చి చేరాయి. ఓవైపు మిడ్‌ మానేరు…ఇంకో వైపు అనంతగిరి…రంగనాయకసాగర్‌… కొండపోచమ్మ రిజర్వాయర్‌ పనులు పూర్తయ్యాయి. ఈ రిజర్వాయర్‌లోకి నీళ్లు చేరుతున్నాయి. మల్లన్నసాగర్‌, హుస్నాబాద్‌ ప్రాంతంలో గౌరెల్లి ప్రాజక్టు పూర్తి కావాల్సి ఉంది. ఈ రెండు కూడా పూర్తి అయితే సిద్దిపేట సెంట్రల్‌గా అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. సిద్దిపేటకు ఎటూ చూసినా వంద కిలోమీటర్లు […]

Advertisement
Update:2020-05-30 05:20 IST

సిద్ధిపేట. దీని చుట్టు పక్కల ప్రాంతాల్లో సాగు నీరు లేకుండా అల్లాడిపోయేది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతం చుట్టూ ఇప్పుడు రిజర్వాయర్లు వచ్చి చేరాయి. ఓవైపు మిడ్‌ మానేరు…ఇంకో వైపు అనంతగిరి…రంగనాయకసాగర్‌… కొండపోచమ్మ రిజర్వాయర్‌ పనులు పూర్తయ్యాయి. ఈ రిజర్వాయర్‌లోకి నీళ్లు చేరుతున్నాయి.

మల్లన్నసాగర్‌, హుస్నాబాద్‌ ప్రాంతంలో గౌరెల్లి ప్రాజక్టు పూర్తి కావాల్సి ఉంది. ఈ రెండు కూడా పూర్తి అయితే సిద్దిపేట సెంట్రల్‌గా అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. సిద్దిపేటకు ఎటూ చూసినా వంద కిలోమీటర్లు నీళ్లే నీళ్ళు.

కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. దీంతో సిద్ధిపేట పరిసర ప్రాంతాల్లో అగ్రి బూమ్‌ వచ్చి పడింది. ఇక్కడ వ్యవసాయ భూములకు ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. పదేళ్ల కిందట ఎకరా ఐదు లక్షలు కూడా పలకలేదు. కానీ ఇప్పుడు రోడ్డు సైడ్‌ ఉన్న వ్యవసాయ భూములు ఎకరా 15 నుంచి 20 లక్షలకు అమ్ముడుపోతున్నాయి.

ప్రాజెక్టుల కింద వ్యవసాయ భూములు కోల్పోయిన వారు మళ్లీ భూమి కొనేందుకు చూస్తున్నారు. దాదాపు పదివేల నుంచి 20 వేల కుటుంబాలు ఇప్పుడు కొత్తగా పునరావాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇళ్ల స్థలాలకు డిమాండ్‌ ఏర్పడింది. సిద్ధిపేట పక్కన ఇళ్ల స్థలం ప్రస్తుతం గుంటకు పది లక్షలు పలికే పరిస్థితి వచ్చింది.

మొత్తానికి నీళ్లు రావడంతో ఇప్పుడు సిద్ధిపేట నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల, మానకొండూరు, హుస్నాబాద్‌ నియోజకవర్గాల ముఖ చిత్రమే మారిపోతోంది. ఒక్కసారిగా ఇక్కడి వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

Tags:    
Advertisement

Similar News