ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఆమె లక్ష్యం " సీఐడీ విచారణలో వెలుగులోకి కొత్త విషయాలు
పథకంతో పనిలేదు. మంచిదా? చెడ్డదా? అనే విచక్షణ లేదు. జగన్ సర్కార్‌పై విషం చిమ్మడమే ఆమె లక్ష్యం. అందు కోసమే సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతోంది. సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు తిట్టడమే పనిగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి సీటును అగౌరవపరిచేలా పోస్టులు పెట్టడం ఆమెకు అలవాటు. పునుతుల రంగనాయకిని సీఐడీ విచారిస్తే తేలిన అంశాలు. సోషల్ మీడియా పోస్టింగ్ లపై పునుతల రంగనాయకి పై గుంటూరులో సీఐడీ విచారణ జరిపింది. ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో ప్రభుత్వంపై […]
పథకంతో పనిలేదు. మంచిదా? చెడ్డదా? అనే విచక్షణ లేదు. జగన్ సర్కార్‌పై విషం చిమ్మడమే ఆమె లక్ష్యం. అందు కోసమే సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతోంది. సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు తిట్టడమే పనిగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి సీటును అగౌరవపరిచేలా పోస్టులు పెట్టడం ఆమెకు అలవాటు. పునుతుల రంగనాయకిని సీఐడీ విచారిస్తే తేలిన అంశాలు.
సోషల్ మీడియా పోస్టింగ్ లపై పునుతల రంగనాయకి పై గుంటూరులో సీఐడీ విచారణ జరిపింది. ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన రంగనాయకి అంశంలో లోతుగా విచారణ జరిపింది.
విశాఖ అంశాన్నే కాకుండా ప్రభుత్వం చేపట్టే ప్రతికార్యక్రమంపై రంగనాయకి ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులు పెట్టినట్టు సీఐడీ గుర్తించింది. అమ్మ ఒడి, వాహనమిత్ర, రైతు భరోసా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలల 50% జీతం తర్వాత ఇచ్చే అంశం, మూడు రాజధానుల అంశం ఇలా వీటన్నింటిపై విషపు ప్రచారానికి ఫేస్ బుక్ పేజ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నట్లు సీఐడీ విచారణలో తేలింది.
సీఐడీ అధికారుల విచారణలో ఒక్క విషయానికి కూడా రంగనాయకి సరైన సమాధానం చెప్పలేదు. టీడీపీ నేతల డైరెక్షన్‌లోనే ఆమె నడిచారు. ఆమె ఉద్దేశపూర్వకంగా ఈరెచ్చగొట్టే పోస్టులు పెట్టారనేది అధికారుల అనుమానం.
మొత్తానికి ఆమె పోస్టులపై సీఐడీ మరోసారి విచారణ జరిపే అవకాశం ఉంది. ఈమె స్వయంగా ఈ పోస్టులు పెట్టారా? లేక ఎవరి ప్రోద్భలంతోనైనా ఇదంతా జరుగుతుందా? అనేది పరిశీలిస్తున్నారు.