తొడకొడుతున్న ఫారం కోడి

కరోనా మొదలైన మొదట్లో చికెట్‌ తినేందుకు చాలా మంది భయపడ్డారు. చికెన్ ద్వారా కూడా వ్యాధి వస్తుందన్న భయంతో వెనక్కు తగ్గారు. దాంతో రెండు నెలల క్రితం చికెన్ ధర కిలో 50 రూపాయలకు పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కోడి తొడ కొడుతోంది. ఏపీలో  కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. కొన్ని చోట్ల కిలో 310కి చేరింది. చికెన్‌పై అపోహలు తొలగిపోవడంతో రెండుమూడు వారాలుగా వినియోగం అమాంతం పెరుగుతోంది. రెండు వారాల క్రితం 200కు […]

Advertisement
Update:2020-05-15 07:10 IST

కరోనా మొదలైన మొదట్లో చికెట్‌ తినేందుకు చాలా మంది భయపడ్డారు. చికెన్ ద్వారా కూడా వ్యాధి వస్తుందన్న భయంతో వెనక్కు తగ్గారు. దాంతో రెండు నెలల క్రితం చికెన్ ధర కిలో 50 రూపాయలకు పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కోడి తొడ కొడుతోంది. ఏపీలో కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. కొన్ని చోట్ల కిలో 310కి చేరింది.

చికెన్‌పై అపోహలు తొలగిపోవడంతో రెండుమూడు వారాలుగా వినియోగం అమాంతం పెరుగుతోంది. రెండు వారాల క్రితం 200కు చేరిన చికెన్ ధర… వారం క్రితం 250ని టచ్ చేసింది. ఇప్పుడు 310కి చేరింది. చికెన్ ధర ఇంకా మరో పాతిక రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చికెన్ ధరలు ఇలా ఆల్‌టైం రికార్డ్ కి చేరడానికి కారణం రాష్ట్రంలో ఉత్పత్తి పడిపోవడమే. రెండు నెలల క్రితం చికెన్ డిమాండ్ కుప్పకూలిపోవడంతో రైతులు పౌల్ట్రీ ఉత్పత్తిని 60 శాతం మేర తగ్గించారు. లాక్‌డౌన్ కారణంగా దాణా సేకరణ కూడా ఇబ్బందిగా మారడంతో ఉత్పత్తి పడిపోయింది. కోళ్ల పెంపకం తగ్గింది. దాంతో చికెన్ ధర ఆకాశాన్నంటింది.

ఒక్క కృష్ణా జిల్లాలో రోజుకు సాధారణ సమయంలో రెండు లక్షల కిలోల చికెన్ (లక్ష కోళ్లు) అమ్ముడుపోయేది. ఆదివారం ఆ డిమాండ్ నాలుగు లక్షల కిలోలుగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కోళ్ల సరఫరా రోజుకు 40వేలకు మించి లేదని వ్యాపారులు చెబుతున్నారు. దీని వల్లే చికెన్ ధరలు పెరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. కోళ్ల ఉత్పత్తి తిరిగి పెరిగే వరకు, అలాగే లాక్‌డౌన్ ఎత్తివేసి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఏర్పడే వరకు ధరలు భారీగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News