తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు ఆదేశాలు

తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంపై ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు… మృతదేహాలకు కరోనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించడం లేదని… మృతదేహాలకు పరీక్షలు నిర్వహించలేదని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రమాదకరమని… ఎందుకు చనిపోయారో తెలుసుకోకపోతే వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని… పరిస్థితి మూడో దశకు వెళ్లే అవకాశం […]

Advertisement
Update:2020-05-14 08:37 IST

తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంపై ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు… మృతదేహాలకు కరోనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించడం లేదని… మృతదేహాలకు పరీక్షలు నిర్వహించలేదని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రమాదకరమని… ఎందుకు చనిపోయారో తెలుసుకోకపోతే వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని… పరిస్థితి మూడో దశకు వెళ్లే అవకాశం ఉందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు.

పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన హైకోర్టు మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించి వారు ఎందుకు చనిపోయారో నిర్ధారించాలని ఆదేశించింది. ఈ నెల 26 వరకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. గత కొంత కాలంగా తెలంగాణలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లతో పాటు మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించడం లేదు. ఎందుకు చనిపోయారో తెలుసుకునే అవకాశం లేకుండాపోయింది.

ఇలా తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలను భారీగా తగ్గించడంపై ఇప్పటికే విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News