చంద్రబాబు బతికి ఉన్నా చచ్చిన శవంతో సమానం...
ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకుని… గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా బాధితులను ఆదుకున్న వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని కొడాలి నాని చెప్పారు. గ్యాస్ లీక్ ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంట్లో దాక్కుని పదేపదే కేంద్రానికి లేఖలు రాసుకుంటూ ఉన్నారన్నారు. గ్యాస్ దుర్ఘటనపై అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్పతో చంద్రబాబు కమిటీ వేసి అదే నిపుణుల కమిటీ అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఐఏఎస్‌లతో వేసిన కమిటీ వేస్ట్ కమిటీ […]
ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకుని… గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా బాధితులను ఆదుకున్న వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని కొడాలి నాని చెప్పారు.
గ్యాస్ లీక్ ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంట్లో దాక్కుని పదేపదే కేంద్రానికి లేఖలు రాసుకుంటూ ఉన్నారన్నారు. గ్యాస్ దుర్ఘటనపై అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్పతో చంద్రబాబు కమిటీ వేసి అదే నిపుణుల కమిటీ అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఐఏఎస్‌లతో వేసిన కమిటీ వేస్ట్ కమిటీ అంటున్న చంద్రబాబు… ఈ ముగ్గురు దద్దమ్మల కమిటీ మాత్రం గొప్పదని చెప్పుకుంటున్నారని విమర్శించారు.
1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిందని .. చాలా మంది తీవ్రంగా గాయపడి ఇప్పటికీ జీవచ్చవాల్లా ఉన్నారని… మరీ అప్పుడు కంపెనీని ఎందుకు మూసివేయలేదని కొడాలి నాని ప్రశ్నించారు. ఆ సమయంలో చంద్రబాబే బ్రోకర్‌గా ఉండి హిందుస్తాన్ నుంచి ఎల్‌జీకి ఈ కంపెనీ మారేలా వ్యవహరించారని నాని గుర్తు చేశారు. 2017లో కంపెనీ విస్తరణకు ఇదే చంద్రబాబు అనుమతి ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు.
2018లో వెళ్తూవెళ్తూ 2021 వరకు కంపెనీ పనులకు అనుమతి ఇచ్చి వెళ్లారన్నారు. కోటి రూపాయలు ఇస్తే బతికి వస్తారా అని ప్రశ్నిస్తున్న ఈ దద్దమ్మ… మరి గోదావరి పుష్కరాల్లో చనిపోయిన వారికి మూడు లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చారని… ఆ మూడు లక్షలతో చనిపోయిన వారు బతికి వచ్చారా అని నిలదీశారు. బోయపాటిని తీసుకొచ్చి చంద్రబాబు ఆయన భార్య, కుమారుడు, కోడలు స్నానం చేసేందుకు గోదావరి పుష్కరాల్లో ఒక్కసారిగా గేట్లు తీస్తే 30 మంది చనిపోయారని నాని వ్యాఖ్యానించారు.
2014 నగరం గ్రామంలో గ్యాస్ పేలి గ్రామం తగలబడిపోతే మూడు లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని కొడాలి నాని ఫైర్ అయ్యారు. అసలు చంద్రబాబు మనిషేనా అని ప్రశ్నించారు. మోడీని ఏపీకి రాకూడదన్న చంద్రబాబు… ఇప్పుడు సిగ్గుశరం లేకుండా మా ఊరు వెళ్తా అనుమతి ఇవ్వండి అంటూ అదే మోడీకి లేఖ రాశారని… ఇంతకంటే దిగజారిన బతుకు ఏమైనా ఉంటుందా అని కొడాలి ఫైర్ అయ్యారు.
కరోనా వస్తుందేమో అని భయంతోనో… లేదంటే గ్యాస్ వద్దకు వెళ్తే ఏమైనా పుండు అవుతుందేమో అని హైదరాబాద్‌లో కూర్చుని డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. అతి త్వరలోనే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందన్నారు. 70ఏళ్లు వచ్చాయని… ఆఖరి దశలోనైనా చంద్రబాబు ఒక మనిషిగా బతకాలని కొడాని నాని సూచించారు.
చంద్రబాబు తన దృష్టిలో బతికి ఉన్నా చచ్చిన వ్యక్తితో సమానమన్నారు. ఉదయం ఒక మాట, సాయంత్రం ఒకమాట మాట్లాడుతూ సిగ్గుశరం లేకుండా ముక్కులో ఆక్సిజన్ పైపుపెట్టుకుని బతుకుతున్నాడని విమర్శించారు. బతికి ఉన్నా చచ్చిపోయిన చంద్రబాబును జనాభా లెక్కల్లోనుంచి తీసేస్తే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందన్నారు.