ఏపీలో ఎన్నికల వాయిదా పొడిగింపు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరోసారి పొడిగించింది. అనువైన వాతావరణం ఏర్పడిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. అప్పటి వరకు వాయిదా కొనసాగుతుందని వివరించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కరోనా పరిస్థితులపై ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. ఎన్నికల నిర్వాహణకు అనుకూల పరిస్థితులు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అప్పటి వరకు ఎన్నికల వాయిదా కొనసాగుతుందని వివరించింది. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి […]

Advertisement
Update:2020-05-06 12:42 IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరోసారి పొడిగించింది. అనువైన వాతావరణం ఏర్పడిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. అప్పటి వరకు వాయిదా కొనసాగుతుందని వివరించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

కరోనా పరిస్థితులపై ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. ఎన్నికల నిర్వాహణకు అనుకూల పరిస్థితులు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అప్పటి వరకు ఎన్నికల వాయిదా కొనసాగుతుందని వివరించింది. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఈసీ ప్రకటించింది.

మార్చి 15న అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన ఎన్నికలు వాయిదా వేయడం దుమారం రేపింది. చివరకు ఆయన పదవికే పరిస్థితులు ఎసరు తెచ్చాయి. అయితే ఇటీవల కరోనా ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వం పావులు కదుపుతోంది అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసీ క్లారిటీ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News