ఏపీలో కరోనా పరీక్షలు " అసలు నిజాలు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కూడా 80 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,177కి చేరింది. వీరిలో 235 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 911. ఈ వైరస్‌ బారిన పడి 31  మంది చనిపోయారు. ఏపీలో గత మూడు రోజులుగా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలో తగ్గాయి. కారణాలేంటి? అనే ప్రచారం నడుస్తోంది. అక్కడ తగ్గాయి. ఇక్కడ పెరిగాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ రాజకీయం […]

Advertisement
Update:2020-04-27 14:33 IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కూడా 80 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,177కి చేరింది. వీరిలో 235 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 911. ఈ వైరస్‌ బారిన పడి 31 మంది చనిపోయారు.

ఏపీలో గత మూడు రోజులుగా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలో తగ్గాయి. కారణాలేంటి? అనే ప్రచారం నడుస్తోంది. అక్కడ తగ్గాయి. ఇక్కడ పెరిగాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ రాజకీయం మొదలైంది.

ఇంతకీ కేసులు పెరగడానికి అసలు కారణాలేంటి? తెలంగాణలో ఎన్ని పరీక్షలు జరిపారు? ఏపీలో ఎన్ని పరీక్షలు చేశారు?… చూస్తే పరిస్థితి అర్ధమవుతుంది.

ఏపీలో కేసులు భారీగా బయటపడుతున్నాయి. మొన్నటి దాకా వైరస్‌ లేని శ్రీకాకుళం జిల్లాలో కూడా నాలుగు కేసులు బయటపడ్డాయి. కారణం ఢిల్లీ వెళ్లి వచ్చిన అతనికి మొదట్లో పరీక్ష చేస్తే నెగెటివ్ వచ్చింది. అయినా సరే క్వారంటైన్‌లో ఉంచారు. తీరా 28 రోజుల తర్వాత తిరిగి టెస్ట్‌ చేసినా నెగెటివే వచ్చింది. కానీ ఆయన కుటుంబంలోని నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏం చేసిందంటే…. మొదట్లో నెగెటివ్ వచ్చినా సరే ఆయన్ని క్వారంటైన్‌ చేసింది. దీంతో వారి కుటుంబసభ్యులకు మాత్రమే వైరస్‌ సోకింది. అదే ఆ వ్యక్తిని ముందే గుర్తించకపోయినా, ఒక వేళ నెగెటివ్ వచ్చిందని వదిలిపెట్టి ఉంటే ఆయన పాతపట్నం మొత్తం వైరస్‌ అంటించేవాడు. ఇక్కడ పరిస్థితిని దగ్గరగా చూస్తే… ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసే ఆరోపణలలోని డొల్లతనం ఇట్టే అర్థమవుతోంది.

సత్తెనపల్లిలో ఓ ప్రబుద్దుడు ఢిల్లీ వెళ్లి వచ్చాడు. కానీ ఆ విషయం దాచిపెట్టాడు. ఊళ్లో ఫ్రెండ్స్‌ కి పార్టీ కూడా ఇచ్చాడు. అతని స్నేహితులకే కాదు… దగ్గరి వారికి కూడా అతను ఢిల్లీ వెళ్లి వచ్చిన విషయం తెలియదు. ఏదో దర్గాకు వెళ్లి వచ్చానని చెప్పి తప్పించుకున్నాడు. కానీ పోలీసులు మాత్రం ఊరుకోలేదు. ఫోన్‌ నెంబర్‌ ట్రేస్‌ చేసి సత్తెనపల్లి పక్కనే ఉండే ఊర్లో తలదాచుకున్న అతన్ని పట్టుకుని క్వారంటైన్‌ కు తరలించారు. అతన్ని సకాలంలో ట్రేస్‌ చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఇతని వల్ల వైరస్‌ సోకింది.

ఏపీలో ప్రభుత్వం ఏం దాచుకోవడం లేదు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తోంది. రాత్రి పదిగంటలకు బులెటిన్ విడుదల చేయడం లేదు. రిజల్ట్స్‌ వచ్చిన వెంటనే అన్ని జిల్లాల సమాచారం కలిపి ఇస్తోంది. మ్యాప్‌ల ద్వారా డిటైల్ గా సమాచారం ఇస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన మేరకు ఇప్పటివరకూ 74,551 టెస్ట్‌లు పూర్తి చేసింది. వీటిలో 1,177 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. రోజుకు పదివేలకు పైగానే పరీక్షలు జరుపుతోంది. దీంతో కేసులు పెరగడం లేదు. పరీక్షల ద్వారా వైరస్‌ ఉన్నవారు బయటపడుతున్నారు.

ఇక తెలంగాణలో నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య కేవలం 14 వేలు. అందులో 943 యాక్టివ్‌ కేసులు. ఇక్కడ కూడా 70వేలకు పైగా టెస్ట్‌లు చేస్తే అప్పుడు ఏపీ, తెలంగాణకు పోలిక ఉండేది.

ఇంచుమించుగా ఇదే స్థాయిలో పరీక్షలు జరిపిన మహారాష్ట్రలో…. లక్షలకు పైగా శాంపిల్స్‌ తీసుకుని టెస్ట్‌లు చేస్తే ఏడు వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. ముంబై లాంటి మహానగరం ఏపీకి లేదని ఇక్కడి ప్రతిపక్ష నాయకులు కొందరు మొదట్లో సన్నాయి నొక్కులు నొక్కేవారు. కానీ విశాఖ, విజయవాడ, గుంటూరు, అమరావతి ని కలిపితే దానికేం తీసిపోదు. ఇక్కడ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ఈ లెక్కలు చూపించి ఏపీ ప్రభుత్వంపై ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.

కొరియా కిట్లు మరో లక్ష ఈ వారంలో వస్తున్నాయి. దీంతో టెస్ట్‌ల సంఖ్య ఇంకా పెరుగుతోంది. వైరస్‌ ఏ గడపకు చేరినా ఇట్టే టెస్ట్‌ చేయడం పూర్తవుతుంది. టెస్ట్‌… ట్రేస్‌… టేక్‌… అనేది కరోనాకు విరుగుడు అని దక్షిణ కొరియాలో రుజువైంది. ఇప్పుడు ఏపీలో అదే చేస్తున్నారు. కానీ తెల్లారితే రాజకీయం చేసి బతికే వారు ఆరోపణలు చేయడం మాత్రం మానలేకపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News