నిమ్మగడ్డ లేఖ వ్యవహరంలో సరికొత్త ట్విస్ట్‌

ఏపీ ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ అంశం లో కొత్త ట్విస్ట్ బయటపడింది. లేఖ ఆధారాలు దొరకకుండా సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు నిమ్మగడ్డ అడిషనల్‌ పీఎస్ సాంబమూర్తి సీఐడీ అధికారుల ముందు ఒప్పుకున్నారు. ల్యాప్ టాప్ లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్ ద్వారా లేఖను డెస్క్ టాప్ లో వేసినట్టు సాంబమూర్తి సీఐడీ అధికారులకు చెప్పారు. ఆ లేఖ ను తర్వాత ‘వాట్సాప్ వెబ్’ ద్వారా రమేష్ […]

Advertisement
Update:2020-04-24 10:44 IST

ఏపీ ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ అంశం లో కొత్త ట్విస్ట్ బయటపడింది. లేఖ ఆధారాలు దొరకకుండా సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు నిమ్మగడ్డ అడిషనల్‌ పీఎస్ సాంబమూర్తి సీఐడీ అధికారుల ముందు ఒప్పుకున్నారు.

ల్యాప్ టాప్ లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్ ద్వారా లేఖను డెస్క్ టాప్ లో వేసినట్టు సాంబమూర్తి సీఐడీ అధికారులకు చెప్పారు. ఆ లేఖ ను తర్వాత ‘వాట్సాప్ వెబ్’ ద్వారా రమేష్ కుమార్ కు పంపారు. ఆ లేఖ ను మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రంకు పంపినట్టు ఇప్పటికే సీఐడీ సమాచారం సేకరించింది.

లేఖను పంపిన తర్వాత ల్యాప్ టాప్ లో ఫైల్స్ డిలీట్ చేశారు. పెన్‌డ్రైవ్‌ను ధ్వంసం చేశారు. లేఖను పంపిన డెస్క్ టాప్ ను కూడా ఫార్మాట్ చేశారు. లేఖకు సంబంధించి అన్ని ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. పీఎస్‌ సాంబమూర్తి ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది.

ఇప్పటికే ఆ లేఖ బయట నుండి వచ్చిందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఆయన ఆరోపణలకు ఆధారాలు దొరికినట్లు అయింది.

లేఖ బయట నుండి రాకపోతే ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇటు ఆధారాలు ట్యాంపర్‌ చేశారనే ఆరోపణలపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. లేఖ నెంబర్ పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్లు సీఐడీ తెలిపింది.

కేంద్రం కు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రాసిన లేఖ నంబర్ 221. అదే నెంబర్ అశోక్ బాబు రాసిన లేఖకు రెఫ్రెన్స్ లెటర్ కు కూడా ఉంది. అయితే ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారనే కోణంలో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని ట్విస్ట్‌లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News