కన్నా 20కోట్లకు అమ్ముడుపోయారు... బ్రోకర్‌గా సుజనా చౌదరి వ్యవహరించారు

విపత్కర పరిస్థితుల్లో శత్రువులు కూడా కలిసి వస్తారని… కానీ చంద్రబాబు వైఖరి మాత్రం పూర్తి భిన్నంగా ఉందని విమర్శించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలే ముఖ్యమన్నట్టుగా విలువలు లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, మానవ జాతికే చంద్రబాబు అవమానకరమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తానే ముఖ్యమంత్రిని అన్నట్టు భ్రమిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ, తన సలహాతోనే దేశం నడుస్తోంది అన్నట్టుగా చంద్రబాబు భ్రాంతి చెందుతున్నారన్నారు. కొందరిని జూమ్ యాప్‌ ద్వారా కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని సీఎం తరహాలోనే వారికి ఆదేశాలు […]

Advertisement
Update:2020-04-19 07:56 IST

విపత్కర పరిస్థితుల్లో శత్రువులు కూడా కలిసి వస్తారని… కానీ చంద్రబాబు వైఖరి మాత్రం పూర్తి భిన్నంగా ఉందని విమర్శించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలే ముఖ్యమన్నట్టుగా విలువలు లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, మానవ జాతికే చంద్రబాబు అవమానకరమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తానే ముఖ్యమంత్రిని అన్నట్టు భ్రమిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ, తన సలహాతోనే దేశం నడుస్తోంది అన్నట్టుగా చంద్రబాబు భ్రాంతి చెందుతున్నారన్నారు. కొందరిని జూమ్ యాప్‌ ద్వారా కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని సీఎం తరహాలోనే వారికి ఆదేశాలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ముత్యాలముగ్గు సినిమా తరహాలో చంద్రబాబు చుట్టూ కొందరు డప్పు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాక్‌డౌన్ లో ఉన్నారో లాకప్‌లో ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.

చంద్రబాబు తొక్కితే సైకిల్ ముందుకు వెళ్లదు… చినబాబు తొక్కితే సైకిల్ ఉండదు అన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. కుటుంబసభ్యుల ఒత్తిడి తట్టుకోలేక చంద్రబాబు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌కు చివరి రోజుల్లో ఏం జరిగిందో చెప్పడానికి లక్ష్మీపార్వతి అయినా ఉన్నారని… కానీ చంద్రబాబుకు చివరి రోజుల్లో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం కూడా లేకుండాపోతోందన్నారు.

చంద్రబాబుకు కరోనా సమస్య పట్టడం లేదని… కుటుంబంలో ఉన్న సమస్యను అధిగమించేందుకే ప్రయత్నిస్తున్నారన్నారు. ఇప్పుడు కేవలం వ్యవస్థల్లో తాను నియమించుకున్న వ్యక్తుల మీద ఆధారపడి రాజకీయం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. రేపటితో 70ఏళ్లు దాటుతున్న చంద్రబాబుకు ఇక మంచి బుద్ది, జ్ఞానం వస్తుందని తాము అనుకోవడం లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

విశాఖ పట్నంలో ఇప్పటికే 16 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారని… ఐదుగురు మాత్రమే చికిత్స పొందుతున్నారని వివరించారు. చంద్రబాబు విశాఖను లక్ష్యంగా చేసుకున్నారని… విశాఖ పై విషం చిమ్మాల్సిందిగా ఎల్లో మీడియాకు చంద్రబాబు ఆదేశాలు కూడా ఇచ్చారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీలో విమర్శిస్తున్న ఏకైక వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ మాత్రమేనని విజయసాయిరెడ్డి అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తికి, కన్నా లక్ష్మీనారాయణకు మధ్య బ్రోకర్‌గా సుజనాచౌదరి వ్యవహరించారన్నారు. అమ్ముడుపోవడం వల్లే బీజేపీ, కేంద్ర విధానాలతో సంబంధం లేకుండా చంద్రబాబు తరహాలోనే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News