ఏపీ, తెలంగాణ రెడ్‌ జోన్లు ఇవే.... 20 తర్వాత కీలక నిర్ణయాలు !

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 525కు చేరింది. బుధవారం కొత్తగా 23 కేసులు పాజిటివ్‌గా తేలాయి. గుంటూరులో అత్యధికంగా 122 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడ అధికారులు అలర్ట్‌ ప్రకటించారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. మరో ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 650కి చేరింది. వీరిలో ఇప్పటివరకూ 118 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 18 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 514 మంది […]

Advertisement
Update:2020-04-16 01:32 IST

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 525కు చేరింది. బుధవారం కొత్తగా 23 కేసులు పాజిటివ్‌గా తేలాయి. గుంటూరులో అత్యధికంగా 122 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడ అధికారులు అలర్ట్‌ ప్రకటించారు.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. మరో ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 650కి చేరింది. వీరిలో ఇప్పటివరకూ 118 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 18 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 514 మంది చికిత్స పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ల జాబితాను కేంద్రం ప్రకటించింది. రెడ్ జోన్‌లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్‌లో 207, మిగతా జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నట్లు తెలిపింది. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు, ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్చుతారు.

ఏపీలో రెడ్ జోన్ జిల్లాలు:

కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్

తెలంగాణలో రెడ్ జోన్ జిల్లాలు:

హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్‌, నల్గొండ

తెలంగాణలో ఆరెంజ్ జోన్ జిల్లాలు:

సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట.

కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం చర్యలు కొనసాగుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. అయితే పరిస్థితులను బట్టి ఈ నెల 20 తరువాత మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News