ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు !
లాక్‌డౌన్ కొనసాగింపు బాటలోనే పలు రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తూ రాష్ట్రాలు నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిర్ణయం ప్రకటించారు. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి లాక్‌డౌన్ మించిన నిర్ణయం మరొకటి లేదని అన్నారు. ఇప్పటికే నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఒడిశా ప్రభుత్వం కూడా నిర్ణయం ప్రకటించింది. కేంద్ర నిర్ణయం కంటే ముందే రాష్ట్రాలు నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి […]
లాక్‌డౌన్ కొనసాగింపు బాటలోనే పలు రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తూ రాష్ట్రాలు నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిర్ణయం ప్రకటించారు. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి లాక్‌డౌన్ మించిన నిర్ణయం మరొకటి లేదని అన్నారు.
ఇప్పటికే నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఒడిశా ప్రభుత్వం కూడా నిర్ణయం ప్రకటించింది. కేంద్ర నిర్ణయం కంటే ముందే రాష్ట్రాలు నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్ ని పొడిగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు.
పంజాబ్, ఒడిశా బాటలోనే పలు రాష్ట్రాలు కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం ప్రధానమంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ జరగబోతోంది. ఈ సమావేశం తర్వాత కేంద్రం తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
దేశంలో కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. సింగపూర్‌లో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత అక్కడ కేసులు పెరిగాయి. దీంతో నెలరోజుల పాటు ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ విధించింది. వివిధ దేశాల పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత లాక్‌డౌన్ పొడిగించాలనే నిర్ణయానికి కేంద్రం కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు.