తెలంగాణ వైన్‌షాపుల్లో లిక్కర్‌ మాయం !

అసలే లాక్‌డౌన్‌. మందు దొరక్క మందుబాబులు తెగ బాధపడుతున్నారు. ఎక్కరైనా ఓ క్వార్టర్‌ దొరికితే చాలు… పదిరోజులు గడుపుదామని ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ విషయం బయటపడింది. తెలంగాణలోని వైన్‌షాపుల్లో లిక్కర్‌ మిస్‌ అవుతోంది. లాక్ డౌన్ ముందు రోజు ఉన్న మద్యం స్టాక్ కి…. ఇప్పుడున్న మద్యంకి భారీ తేడా కనిపిస్తోంది. తాళం వేసి ఉన్న లిక్కర్ షాపుల్లో నుంచి లిక్కర్‌ మాయమవుతోంది. లాక్‌డౌన్‌ ముందురోజు వైన్‌షాపుల్లో మద్యం నిల్వలపై ఎక్సైజ్‌ శాఖ లెక్కలు […]

Advertisement
Update:2020-04-09 04:34 IST

అసలే లాక్‌డౌన్‌. మందు దొరక్క మందుబాబులు తెగ బాధపడుతున్నారు. ఎక్కరైనా ఓ క్వార్టర్‌ దొరికితే చాలు… పదిరోజులు గడుపుదామని ఆరా తీస్తున్నారు.

అయితే ఇప్పుడు ఓ విషయం బయటపడింది. తెలంగాణలోని వైన్‌షాపుల్లో లిక్కర్‌ మిస్‌ అవుతోంది. లాక్ డౌన్ ముందు రోజు ఉన్న మద్యం స్టాక్ కి…. ఇప్పుడున్న మద్యంకి భారీ తేడా కనిపిస్తోంది. తాళం వేసి ఉన్న లిక్కర్ షాపుల్లో నుంచి లిక్కర్‌ మాయమవుతోంది.

లాక్‌డౌన్‌ ముందురోజు వైన్‌షాపుల్లో మద్యం నిల్వలపై ఎక్సైజ్‌ శాఖ లెక్కలు రాసిపెట్టింది. ఎంత సరుకు వైన్‌షాపుల్లో ఉందో లెక్కలు తీసి పెట్టింది. అయితే తీరా ఇప్పుడు చూస్తే వైన్‌షాపుల్లో లిక్కర్‌ తేడాలు కనిపిస్తున్నాయట. చాలా చోట్ల లిక్కర్‌ రాత్రికి రాత్రి తరలించి వైన్‌షాపు యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. లోకల్ లీడర్ల అండతో రాత్రికి రాత్రి లిక్కర్‌ తరలించి బ్లాక్‌లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. 750 రూపాయలు ఉండే పుల్‌ బాటిల్‌ ధర మొన్నటి వరకూ 2500 రూపాయల వరకు అమ్మారు. తాజాగా ఇప్పుడు 4 వేల నుంచి ఐదు వేల వరకు పెంచారట.

లిక్కర్ అమ్మకాలపై దృష్టిపెట్టిన ఎక్సైజ్‌శాఖ ఇప్పటి వరకూ తెలంగాణ వ్యాప్తం గా 78 కేసులు నమోదు చేసింది. తెలంగాణ లో ఇప్పటివరకు 8 వైన్స్ లో దొంగతనాలు జరిగాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ వైన్స్‌ లతో పాటు హోటల్‌ళ్లను ఎక్సైజ్‌ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. అయితే సీజ్‌ చేసిన షాపుల్లో నుంచి కూడా మద్యం మాయమైంది. లాక్‌డౌన్ తర్వాత లిక్కర్‌ గోడౌన్‌, షాపుల్లో లెక్క తేలుస్తామని అధికారులు అంటున్నారు. లెక్క తప్పితే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు మద్యానికి వ్యసనం అయిన కొందరు లాక్‌డౌన్‌ కాలంలో మద్యం దొరక్కపోవడంతో అల్లాడిపోతున్నారు. మద్యానికి బానిసైన వీరు ఒక చుక్క దొరికితే చాలు అంటూ మందు కోసం బయట తిరుగుతున్నారు. లిక్కర్ లేకపోవడంతో కొందరు మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు హైదరాబాద్‌ ఎర్రగడ్డకి భారీ గా వస్తున్నారు. మద్యం దొరక్క మానసికంగా బాధపడతున్నవారు ఇప్పటివరకు 800 మంది ఎర్రగడ్డ ఆసుపత్రికి వచ్చినట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు. వీరిలో 175 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News