కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడాలంటే.... ఇదొక్కటే మార్గమట !

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు కేసుల పరీక్షలు గణనీయంగా పెంచటం తప్ప వేరే మార్గమే లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన దేశంలో కరోనా లేదని నిర్ధారణకు రావాలంటే కనీసం పదిలక్షల మందికి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం వుందని…. ఆ తరువాతనే ఎటువంటి ఆర్ధిక, సామజిక మాంద్యం ప్రభావాలను తగ్గించుకోవడానికి వీలవుతుందని… యుకె లోని ఎసీఎఎల్ఎమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే వైరస్ పరీక్షలను వేగవంతంగా పెంచటం తప్ప వేరే మార్గం లేదని… ఈ పరిశోధనల్లో […]

Advertisement
Update:2020-04-07 09:30 IST

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు కేసుల పరీక్షలు గణనీయంగా పెంచటం తప్ప వేరే మార్గమే లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన దేశంలో కరోనా లేదని నిర్ధారణకు రావాలంటే కనీసం పదిలక్షల మందికి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం వుందని…. ఆ తరువాతనే ఎటువంటి ఆర్ధిక, సామజిక మాంద్యం ప్రభావాలను తగ్గించుకోవడానికి వీలవుతుందని… యుకె లోని ఎసీఎఎల్ఎమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే వైరస్ పరీక్షలను వేగవంతంగా పెంచటం తప్ప వేరే మార్గం లేదని… ఈ పరిశోధనల్లో పాల్గొన్న భారతీయ శాస్త్రవేత్త రాహుల్ ఈ విషయాలను వెల్లడించారు. ముఖ్యమైన 50 దేశాలమీద కోవిడ్ 19 ప్రభావం అనే అంశం మీద అయన పరిశోధనలు చేశారు. ఆయా దేశాలలో నమోదైన కరోనా వైరస్ కేసుల సంఖ్య, అక్కడ జరిపిన పరీక్షల సంఖ్య మధ్య వున్న సంబంధం మీద ఆ పరిశోధనలు జరిపినట్టు అయన చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు, మరణాల నిష్పత్తి చాలా వైవిధ్యంగా వుందని… ఆయా దేశాల్లో ఈ గణాంకాల ఆధారంగానే నివారణ చర్యలు తీసుకుంటున్నారని… ఎటువంటి వ్యాధి నిర్ధారణకు అయినా ఎదో ఒక ప్రమాణం కావాలని చెబుతున్నారు. ఆ ప్రమాణం ఏమిటో కనుక్కోకుండా ఎటువంటి చికిత్స, నివారణ చర్యలు తీసుకోలేమని… ప్రస్తుత కరోనా సమస్యకు అటువంటి ప్రమాణం… నిర్వహించిన పరీక్షల సంఖ్య మాత్రమేనని గుర్తుచేస్తున్నారు.

కోవిడ్ 19 ఎలా విస్తరిస్తోంది అనే పరిశోధనల్లో ప్రధానంగా మూడు అంశాల ఆధారంగా వుంది. ఒకటి…. ప్రతి దేశంలోనూ ప్రతి కేసుకు లేదా మరణానికి అక్కడ జరిపిన పరీక్షల సంఖ్యకు వున్న నిష్పత్తి. రెండవది.. లక్ష పరీక్షలు పైగా నిర్వహించిన దేశాలు, మూడవది.. కేసులు, మరణాల సంఖ్యను నియంత్రించడంలో అత్యధికంగా పాటుపడిన దక్షిణ కొరియా.

మరణాల సంఖ్య ఒక్కో అంశానికి ఒక్కోలా వున్నాయి. ఏ దేశాల్లో అయితే జనాభా ఆధారంగా వైరస్ పరీక్షల సంఖ్య ఎక్కువగా ఉందో ఆ దేశాల్లో మరణాల రేటు తక్కువగా వుంది. వైరస్ పరీక్షలు వీలైనంత ఎక్కువగా చేయటం వల్ల వైరస్ సోకి మరణించే అవకాశం వున్న రోగుల సంఖ్య తెలుసుకునే అవకాశం ఉంటుందని ఎసీఎఎల్ఎమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి ఈ గణాంకాలే మనకు ఆధారమంటున్నారు. తమ జనాభా సంఖ్యలో 1 శాతం కన్నా ఎక్కువగా వైరస్ పరీక్షలు నిర్వహించిన దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. దీన్ని బట్టి చుస్తే మన దేశంలో కనీసం కోటిన్నర వైరస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, కానీ సాధ్యాసాధ్యాల దృష్ట్యా కనీసం పదిలక్షల వైరస్ పరీక్షలు అయినా నిర్వహిస్తే కానీ ఫలితం ఉండదు అన్నారు.

వైరస్ వ్యాప్తి ఎంత ఉందో తెలుసుకోడానికి కూడా వైరస్ పరీక్షలు భారీగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కేవలం ఆరోగ్య సేవల ప్రణాళికలకు మాత్రమే కాకుండా హాట్ స్పాట్ల గుర్తింపునకు కూడా దీనివల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. అవసరాన్ని బట్టి క్వారంటైన్ లేదా ఐసోలేషన్ విధానాలు కూడా పెంచుకోవచ్చు అన్నారు.

31 డిసెంబర్ 2019న చైనా లోని వుహాన్ నగరంలో కోవిడ్ 19 మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ కి ఎటువంటి వాక్సినేషన్ లేకపోవటం వల్ల సామజిక జాగ్రత్తలు తీసుకోవటం తో పాటు వైరస్ పరీక్షలను విస్తృతంగా నిర్వహించటం వల్ల వ్యాధి తీవ్రతను అంచనా వేయటం, తద్వారా దీని నుండి సమాజాన్ని కాపాడుకోవటం వీలవుతుందని చెబుతున్నారు. వాక్సినేషన్ లేకపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 5 లక్షల మంది మరణించే ప్రమాదాన్ని… వైరస్ పరీక్షల సంఖ్య పెంచుకోవటం ద్వారా నియంత్రించవచ్చు అన్నారు.

Tags:    
Advertisement

Similar News