ముద్రగడ మనసు ఢిల్లీ వైపు లాగుతుందా? ఆ ప్రకటనల వెనుక అసలు కథేంటి?

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు స్పందించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం…. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన స్వగృహంలో కుటుంబసమేతంగా కలిసి దీపాలు వెలిగించారు. ఇలాంటి స్క్రోలింగ్‌ వార్తలు ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం ప్రధాని పిలుపుకు నెల రోజుల్లోనే రెండు నుంచి మూడుసార్లు స్పందించారు. దీంతో ఈ కాపు ఉద్యమ నేత కమలం రూట్లో వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? అనే డౌట్లు జనాల్లో మొదలయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల […]

Advertisement
Update:2020-04-06 02:53 IST

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు స్పందించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం…. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన స్వగృహంలో కుటుంబసమేతంగా కలిసి దీపాలు వెలిగించారు.

ఇలాంటి స్క్రోలింగ్‌ వార్తలు ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం ప్రధాని పిలుపుకు నెల రోజుల్లోనే రెండు నుంచి మూడుసార్లు స్పందించారు. దీంతో ఈ కాపు ఉద్యమ నేత కమలం రూట్లో వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? అనే డౌట్లు జనాల్లో మొదలయ్యాయి.

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఆయన కమలం కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆగింది. బీజేపీ జాతీయ నేతలు ఆయన్ని పార్టీలోకి రమ్మని ఆహ్వానించారట. కానీ ఆయన అప్పుడు కొంత సమయం కావాలని అడిగారట. తీరా ఇప్పుడు చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో పోటీ పడుతూ ముద్రగడ ప్రెస్‌ స్టేట్‌మెంట్లు రిలీజ్‌ చేస్తున్నారు. దీపాల వీడియోలు కూడా వాట్సాప్‌లో పంపిస్తున్నారు.

కాపు ఉద్యమ నేతగా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేశారు. ఆయన కొన్ని డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే వాటిపై క్లారిటీ రాలేదు. అయితే ఈ మధ్య ఆయనకు ఏ పార్టీలో చోటు లేకుండా పోయింది. అధికార పార్టీలోకి వెళ్లే చాన్స్‌ లేదు. ప్రతిపక్షం పిలిచే ప్రసక్తేలేదు. దీంతో బీజేపీలోకి వెళ్లాలని ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో భాగంగా కమలం నేతలకు సంకేతాలు పంపేందుకు ఈ ప్రకటనలు చేస్తున్నారట.

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను ప్రకటించారు. కానీ ఏపీకి కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. కన్నాను కొనసాగిస్తారో… లేదో అనే డౌట్‌ ఉంది. మరీ ఇటువంటి సమయంలో ముద్రగడను పార్టీలోకి ఎవరూ ఆహ్వానిస్తారనేది పెద్ద ప్రశ్న. కన్నా తనకు పోటీగా మరో కాపు నేతను పార్టీలోకి రానిస్తారా? అనేది మరో ప్రశ్న.

అయితే కాకినాడ లింక్‌ ద్వారా రాంమాధవ్‌ను కలిసి బీజేపీలో చేరే ఆలోచనలో ముద్రగడ ఉన్నారట. ఈ కరోనా కాలం దాటిన తర్వాత ఆయన కమలం కండువా కప్పుకుంటారని ఓ ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.

Tags:    
Advertisement

Similar News