నిత్యావసరాల ధరలు పెంచితే.. కఠిన చర్యలే!
లాక్ డౌన్ నేపథ్యంలో.. మిగతా ప్రాంతాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా.. కొందరు వ్యాపారులు ధరలు పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను.. ఇలా ధరలు పెంచి మరింత ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదని నిర్ణయం తీసుకుంది. కాస్త కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించి.. ఆ బాధ్యతను అధికారులను అప్పగించింది. బియ్యం, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల […]
లాక్ డౌన్ నేపథ్యంలో.. మిగతా ప్రాంతాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా.. కొందరు వ్యాపారులు ధరలు పెంచి విక్రయాలు చేస్తున్నారు.
ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను.. ఇలా ధరలు పెంచి మరింత ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదని నిర్ణయం తీసుకుంది. కాస్త కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించి.. ఆ బాధ్యతను అధికారులను అప్పగించింది.
బియ్యం, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ధరలను జిల్లాల్లోని పరిస్థితుల ఆధారంగానే.. ఎక్కడికక్కడ ఖరారు చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారులకు తెలిపింది. కలెక్టర్ నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్లు, మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ లతో పాటు పూర్తిగా 10 మంది అధికారుల కమిటీని ఏర్పాటు చేసినట్టుగా వార్తలు వెలువడ్డాయి. బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలను ఈ కమిటీని నిర్ధారించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. రైతుబజార్లలో ఇకపై నిత్యావసరాల ధరలు ప్రదర్శించాలి. ఆ ప్రకారమే వాటిని అమ్మాలి. అలాగే.. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే 1902 కాల్ సెంటర్ కు ఫోన్ చేయాల్సిందిగా.. ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఈ బాధ్యతలన్నీ.. కలెక్టరు నేతృత్వంలోని కమిటీనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ధరలు పెంటి ఎవరైనా అమ్మకాలు జరిపితే.. సదరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యాపారులు కూడా.. ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలి. మామూలు రోజుల్లో కంటే ప్రస్తుతం కూరగాయల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. వాటిని మరింత పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని గ్రహించాలి. ప్రభుత్వానికి సహకరిస్తూ కరోనాను ఎదుర్కోవడంలో తమ వంతు బాధ్యత వహించాలి.