ఇంగ్లండ్ క్రికెటర్ల జీతాల్లో భారీగా కోత

కరోనా వైరస్ దెబ్బతో ఈసీబీ నిర్ణయం నియమనిబంధనలు తుచ తప్పుకుండా పాటించే ఇంగ్లండ్ లో…ఏదైనా సరే లెక్కంటే లెక్కేమరి. జీవితమైనా, క్రికెట్లో అయినా సరే ఉదారత్వం, దాతృత్వం అన్నమాటలకు చోటే లేదు.  ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న కరోనా వైరస్..అలనాడు ప్రపంచాన్నే ఏలిన ఇంగ్లండ్ ను సైతం గడగడ లాడిస్తోంది. వైరస్ దెబ్బతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు..మూడుమాసాల షట్ డౌన్ ప్రకటించడంతో… క్రికెట్ మాత్రమే కాదు… క్రీడా కార్యకలాపాలు సైతం స్తంభించిపోయాయి. వివిధ దేశాలతో ఇంగ్లండ్ […]

Advertisement
Update:2020-03-31 02:30 IST
  • కరోనా వైరస్ దెబ్బతో ఈసీబీ నిర్ణయం

నియమనిబంధనలు తుచ తప్పుకుండా పాటించే ఇంగ్లండ్ లో…ఏదైనా సరే లెక్కంటే లెక్కేమరి. జీవితమైనా, క్రికెట్లో అయినా సరే ఉదారత్వం, దాతృత్వం అన్నమాటలకు చోటే లేదు.

ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న కరోనా వైరస్..అలనాడు ప్రపంచాన్నే ఏలిన ఇంగ్లండ్ ను సైతం గడగడ లాడిస్తోంది. వైరస్ దెబ్బతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు..మూడుమాసాల షట్ డౌన్ ప్రకటించడంతో… క్రికెట్ మాత్రమే కాదు… క్రీడా కార్యకలాపాలు సైతం స్తంభించిపోయాయి.

వివిధ దేశాలతో ఇంగ్లండ్ ఆడాల్సిన స్వదేశీ, విదేశీ సిరీస్ లు రద్దుకావడంతో ఈసీబీ ఆదాయం సైతం భారీగా పడిపోయే ప్రమాదంలో పడింది. దీంతో కౌంటీ క్రికెటర్లతో పాటు.. ఇంగ్లండ్ కాంట్రాక్టు క్రికెటర్లకు సైతం జీతాల్లో భారీగా కోత విధించాలని నిర్ణయించింది.

మూడుమాసాల కాలంలో రద్దయిన, జరగని సిరీస్ లకు కాంట్రాక్టు వేతనం చెల్లించేదిలేదని ప్రకటించింది. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ ఇంగ్లండ్ అగ్రశ్రేణి క్రికెటర్లు జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ లు… 2లక్షల పౌండ్ల చొప్పున వేతనం కోల్పోనున్నారు.

ఈ మూడుమాసాల కాలంలో స్వదేశంలో పాకిస్తాన్ , వెస్టిండీస్ తో ఆడాల్సిన టెస్టు సిరీస్ లు, ఆస్ట్ర్రేలియాతో ఆడాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ లు రద్దుల పద్దులో చేరే ప్రమాదం ఉండడంతో తాము భారీగా ఆదాయం కోల్పోక తప్పదని ఈసీబీ అంచనా వేసింది.

వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వేతనాలలో కోత నిర్ణయం తీసుకొన్నట్లు తమ కాంట్రాక్టు ఆటగాళ్లకు వివరించింది.

ఇదే …మన భారత్ లో మాత్రం…లాక్ డౌన్ పుణ్యమా ఆంటూ మూడుఫార్మాట్ల ఆటగాళ్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా లతో సహా మిగిలిన కాంట్రాక్టు క్రికెటర్లు..ఒక్కమ్యాచ్ ఆడకున్నా..మన బీసీసీఐ మాత్రం 7 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి ఇవ్వనుంది.

ఇదంతా చూస్తుంటే…ఇంగ్లండ్ కు, భారత్ కు ఎంతలో ఎంతతేడా. కష్టపడకుండానే ఫలితాన్ని పొందే అద్భుతమైన అవకాశం ఉన్న అదృష్టవంతులు భారత క్రికెటర్లు మాత్రమేనని అనుకోక తప్పదు.

Tags:    
Advertisement

Similar News