ఈఎంఐ తప్పించుకోవడం అంత ఈజీ కాదు..!

ఆర్బీఐ నిబంధనలు కఠినమే మూడు నెలల వడ్డీపై మారటోరియం లేదు కట్టకపోతే వడ్డీ భారమే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రైతుల ఆర్థిక పరిస్థితి కుదేలయ్యేలా ఉంది. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా పడటంతో ప్రైవేటు ఉద్యోగులకు వచ్చే నెల జీతాలు వస్తాయో రావో అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటించిన ఈఎంఐ మారటోరియం సామాన్యులకు ఊరట కలిగించేలా ఉందని అందరూ భావించారు. తీరా ఆర్బీఐ నిబంధనలు చూసి […]

Advertisement
Update:2020-03-28 04:34 IST
  • ఆర్బీఐ నిబంధనలు కఠినమే
  • మూడు నెలల వడ్డీపై మారటోరియం లేదు
  • కట్టకపోతే వడ్డీ భారమే

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రైతుల ఆర్థిక పరిస్థితి కుదేలయ్యేలా ఉంది. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా పడటంతో ప్రైవేటు ఉద్యోగులకు వచ్చే నెల జీతాలు వస్తాయో రావో అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటించిన ఈఎంఐ మారటోరియం సామాన్యులకు ఊరట కలిగించేలా ఉందని అందరూ భావించారు. తీరా ఆర్బీఐ నిబంధనలు చూసి పెదవి విరుస్తున్నారు. సామాన్యుడి రుణభారాన్ని తగ్గించకపోగా.. మారటోరియం విధించుకుంటే మూడు నెలల తర్వాత వడ్డీ రూపేణా మరింత భారం రుణ గ్రహీతలపై పడబోతోంది.

ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని ఆర్బీఐ మూడు నెలల పాటు అన్ని రకాల రుణాలపై మారటోరియం విధించింది. కాగా, ఆ మారటోరియం ఉపయోగించుకోవాలంటే పాటించాల్సిన నిబంధనలు గుదిబండగా మారబోతున్నాయి. మీరు పర్సనల్ లోన్ కానీ వెహికిల్ లోన్ కాని తీసుకున్నారనుకుందాం… వాస్తవానికి ఏప్రిల్ 2020లో మీరు చివరి ఇన్‌స్టాల్ మెంట్ కట్టాల్సి ఉంది. కానీ ఆ ఈఎంఐపై మీరు మూడు నెలల మారటోరియం విధించుకుంటే.. మూడు నెలల తర్వాత మీరు కట్టే ఈఎంఐ‌కి మారటోరియం కాలపు వడ్డీ కలిపి మరీ వసూలు చేస్తారన్నమాట. అంటే డబ్బుంటే వచ్చే నెలలోనే కట్టేస్తే మంచిది.. లేకుంటే అదనపు వడ్డీ భారం మోయాల్సిందే.

అంతే కాదు, మారటోరియంను బ్యాంకులు ఆటోమేటిక్‌గా వర్తింపజేయవు. మీరు స్వయంగా ఎక్కడి నుంచైతే రుణం పొందారో.. ఆ బ్యాంకును గానీ ఆర్థిక సంస్థను కానీ సంప్రదించి మారటోరియం గడువును కోరాల్సి ఉంటుంది. మీరు అడిగిన వెంటనే బ్యాంకులు మారటోరియం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మీ ఆదాయం, వ్యయాలను లెక్కతేల్చి.. మారటోరియానికి అర్హులో కాదో నిర్ణయింస్తుంది. ఒక వేళ మీరు ఎలాంటి దరఖాస్తు చేయకపోతే వచ్చే నెల మీ ఈఎంఐ ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది.

క్రెడిట్ కార్డుకు కూడా మారటోరియం వాడుకునే వెసులు బాటు ఉంది. కాని క్రెడిట్ కార్డుల వాడకంపై వడ్డీ రేటు చాలా ఎక్కువ. మూడు నెలలపాటు మీరు బిల్లులు ఆపితే వడ్డీ భారం చాలా పెరిగిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బిల్లులు చెల్లించడమే ఉత్తమమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇన్ని నిబంధనలు చూసిన తర్వాత కూడా మీరు మారటోరియానికి సిద్దపడితే.. భవిష్యత్‌లో ఆర్థిక భారం మరింత కష్టతరం కావొచ్చు.

ఇక ఈ మారటోరియం వాణిజ్య, సహకార బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, గృహరుణ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. పీర్ టూ పీర్ రుణాలకు ఈ మారటోరియం లేదు. ఇది కేవలం వాయిదాలను వాయిదా వేయడమే కాని రుణాలను రద్దు చేయడం కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News