ఆర్బీఐ కీలక నిర్ణయం... 3 నెలలు ఈఎంఐలపై మారటోరియం

కరోనా ప్రభావం ప్రజలపైనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు అన్ని రకాల లోన్ ల ఈఎంఐలపై బ్యాంకులకు మారటోరియం విధించారు. దీంతో ఈ మూడు నెలలు ఏ సంస్థ కూడా ఈఎంఐలను కట్ చేయకూడదు. మరోవైపు […]

Advertisement
Update:2020-03-27 06:22 IST

కరోనా ప్రభావం ప్రజలపైనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు అన్ని రకాల లోన్ ల ఈఎంఐలపై బ్యాంకులకు మారటోరియం విధించారు. దీంతో ఈ మూడు నెలలు ఏ సంస్థ కూడా ఈఎంఐలను కట్ చేయకూడదు. మరోవైపు రెపోరేటును 75 పాయింట్లు తగ్గించగా, రివర్స్ రెపో రేటును 90 పాయింట్లకు కుదించింది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోందని.. ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గత నాలుగు రోజుల మధ్య జరిపిన పలు సమావేశాల్లో తాజా పరిస్థితులను సమీక్షించామని.. అప్పుడు తీసుకున్న నిర్ణయాలనే ఇప్పుడు వెల్లడిస్తున్నట్లు శక్తికాంత్ దాస్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News