పాల కోసం వెళ్తే పోలీసులు చితకబాదారు... యువకుడు మృతి..!
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కొందరు సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు బయట తిరగొద్దన్న ఒక్క సాకు చూపించి కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లవచ్చని కేంద్రమే మార్గదర్శకాలు విడుదల చేయగా.. పోలీసులు మాత్రం కనీసం ఎవరు ఎందుకు బయటకు వచ్చారో కూడా కనుక్కోకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా పోలీసుల అత్యుత్సాహానికి ఒక యువకుడు బలయ్యాడు. ఇండియా టుడే కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని […]
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కొందరు సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు బయట తిరగొద్దన్న ఒక్క సాకు చూపించి కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
నిత్యావసరాల కోసం బయటకు వెళ్లవచ్చని కేంద్రమే మార్గదర్శకాలు విడుదల చేయగా.. పోలీసులు మాత్రం కనీసం ఎవరు ఎందుకు బయటకు వచ్చారో కూడా కనుక్కోకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా పోలీసుల అత్యుత్సాహానికి ఒక యువకుడు బలయ్యాడు.
ఇండియా టుడే కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో లాలా స్వామి (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గురువారం పాలకోసం సమీపంలోని బూత్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అతడిని గమనించారు. లాక్‌డౌన్ సమయంలో ఎందుకు బయటకు వచ్చావని బాధితుడిని ప్రశ్నించగా.. అతను పాల ప్యాకెట్ కోసం వచ్చానని చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు అతడిని లాఠీలతో చితకబాదారు.
పోలీసుల దాడిలో అతను స్పృహ కోల్పోయాడు. దాంతో అతడిని అక్కడే వదిలేసి పారిపోయారు. స్థానికులు లాల్ స్వామిని ఆసుపత్రికి తరలించారు. కాగా అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఇప్పుడు లాల్ స్వామి పైనే ఆధారపడిన అతని కుటుంబం అనాధగా మారింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన లాల్ స్వామిపై పోలీసులు అకారణంగా దాడి చేశారని ఆరోపించిన కుటుంభ సభ్యులు… తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.