తెలంగాణలో మరో 3 పాజిటివ్.... 36కు కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం మరో 3 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ ముగ్గురితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశాఖ కొద్దిసేపటి క్రితం అధికారికంగా బులెటెన్ విడుదల చేసింది. మంగళవారం ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ ముగ్గురు జర్మనీ, సౌదీ, లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన వారే. లండన్ నుంచి హైదరాబాద్ […]

Advertisement
Update:2020-03-24 12:18 IST

తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం మరో 3 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ ముగ్గురితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశాఖ కొద్దిసేపటి క్రితం అధికారికంగా బులెటెన్ విడుదల చేసింది.

మంగళవారం ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ ముగ్గురు జర్మనీ, సౌదీ, లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన వారే.

లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన కోకాపేటకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇక జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ తేలింది. సౌదీ నుంచి వచ్చిన 61 ఏళ్ల వయసుగల మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా మరో 9 అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. వీరిని క్వారంటైన్ కు తరలించారు.

తెలంగాణలో కరోనా రెండో స్టేజీకి చేరింది. వైరస్ బాధితులతో తిరిగిన వారికి కూడా సోకడం మొదలైనట్టుగా కనిపిస్తోంది. కరీంనగర్ లో కూడా ఇండోనేషియన్లతో తిరిగిన వారికి కరోనా లక్షణాలు కనిపిస్తుండడం కలకలం రేపుతోంది.

Tags:    
Advertisement

Similar News