భారత్ లో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటన దిశగా మోడీ?
కరోనా వైరస్ తో దేశం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ లతో దేశం మొత్తం బంద్ పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రమాదంలో పడబోతోంది. దీంతో మోడీ కూడా ఈ క్లిష్ట పరిస్థితిల్లో రాజ్యాంగంలో అరుదుగా ఉపయోగించే ఆర్టికల్ ను తెరపైకి తీసుకురాబోతున్నారని సమాచారం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 360ని మోడీ సోమవారం నుంచి ప్రారంభించాడని తెలిసింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక అత్యవసర పరిస్థితులను విధించడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఇది […]
కరోనా వైరస్ తో దేశం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ లతో దేశం మొత్తం బంద్ పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రమాదంలో పడబోతోంది. దీంతో మోడీ కూడా ఈ క్లిష్ట పరిస్థితిల్లో రాజ్యాంగంలో అరుదుగా ఉపయోగించే ఆర్టికల్ ను తెరపైకి తీసుకురాబోతున్నారని సమాచారం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 360ని మోడీ సోమవారం నుంచి ప్రారంభించాడని తెలిసింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక అత్యవసర పరిస్థితులను విధించడానికి వీలు కల్పిస్తుంది.
అయితే ఇది అమలు చేస్తున్నట్టు ప్రధాని మోడీ కానీ కేంద్ర మంత్రులు కానీ ఏ ఒక్కరూ కూడా మాట మాట్లాడకపోవడం గమనార్హం. తాజాగా బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేస్తూ ‘కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయడంతో ఆర్థిక అత్యవసర పరిస్థితుల గురించి కేంద్ర ప్రభుత్వంలో చర్చలు జరిగాయి. కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. సెన్సెక్స్ క్షీణించి రూపాయి మరింత పడిపోయింది. మోడీ కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రవేశపెడుతున్నారు. చర్చిస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్టికల్ 360 కింద ఎకనామిక్ ఎమర్జెన్సీని కేంద్రం విధిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక వ్యయాన్ని నియంత్రించడానికి కేంద్రం అనుమతిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించడానికి కూడా ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి రెండు నెలల కాలానికి అమలులో ఉంటుంది. కానీ ఇంకా పొడిగించాల్సి వస్తే.. ప్రభుత్వం దాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింప చేసుకోవాల్సి ఉంటుంది.