మొన్న ప్రెస్ నోట్... ఈసారి వీడియో
ఎప్పుడైతే తెలంగాణలోకి కరోనా వచ్చిందో ఆ క్షణం నుంచే అప్రమత్తమయ్యాడు చిరంజీవి. అందరికంటే ముందు తన సినిమా షూటింగ్ ను ఆపేశారు. కోట్ల రూపాయల నష్టం వచ్చినా, తన టెక్నీషియన్స్ ఆరోగ్యం ముఖ్యమని, కరోనా విషయంలో అంతా జాగ్రత్తగా ఉండాలని అప్పట్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే కేవలం అలా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఊరుకోలేదు ఈ హీరో. తన వంతు బాధ్యతగా తాజాగా మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. కరోనా నుంచి […]
ఎప్పుడైతే తెలంగాణలోకి కరోనా వచ్చిందో ఆ క్షణం నుంచే అప్రమత్తమయ్యాడు చిరంజీవి. అందరికంటే ముందు తన సినిమా షూటింగ్ ను ఆపేశారు. కోట్ల రూపాయల నష్టం వచ్చినా, తన టెక్నీషియన్స్ ఆరోగ్యం ముఖ్యమని, కరోనా విషయంలో అంతా జాగ్రత్తగా ఉండాలని అప్పట్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
అయితే కేవలం అలా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఊరుకోలేదు ఈ హీరో. తన వంతు బాధ్యతగా తాజాగా మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతూ ఓ వీడియో చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే కరోనాపై అవగాహన కల్పిస్తూ.. విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ లాంటి ఎంతోమంది హీరోలు జాగ్రత్తలు చెప్పారు. తాజాగా చిరంజీవి మరోసారి కరోనాపై జాగ్రత్తగా ఉండమని సూచించారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు చిరు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. కొత్త షెడ్యూల్ డేట్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. కరోనా తగ్గిన తర్వాత సినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.
Stay Safe
Publiée par Megastar Chiranjeevi sur Jeudi 19 mars 2020