టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
ప్రముఖ సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి తుదిశ్వాస విడిచారు
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూశారు. ఆయన దుబాయ్‌లో మృతి చెందినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే కేదార్.. గత కొంతకాలంగా అస్వస్థత తో బాధపడుతున్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది. కానీ ఆయన మరణానికి కారణం సరిగా ఏంటి అనేది ఇంకా తెలియదు. అయితే కొంతకాలం నుంచి దుబాయ్ లో నివాసం ఉంటున్న కేదార్ కు.. ఒక కూతురు కూడా ఉంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు.
బన్నీవాసు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు సన్నిహితుడు. అయితే కేదార్ నిర్మించిన గంగం గణేశా సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇందులో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా.. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, ప్రిన్స్ యావర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ తర్వాత ఆయన గత సంవత్సరం విడుదల అయిన రాజు యాదవ్ అనే సినిమాను కూడా ప్రజల ముందుకు తెచ్చారు.