తమన్నా 'ఓదెల 2' మూవీ టీజర్స్ అదుర్స్
2022లో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న మూవీ
Advertisement
తమన్నా ప్రధాన పాత్రధారిగా అశోక్‌తేజ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'ఓదెల 2' . హెబ్బా పటేల్, విశిష్ఠ ఎన్. సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం మహాకుంభమేళాలో విడుదల చేసింది. 2022లో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు కొనసాగింపుగా ఈ మూవీ రూపొందుతున్న విషయం విదితమే.ఈ సందర్బంగా తమన్నా ఎన్నో సినిమాల్లో నటించాను. మహాకుంభమేళాలో ఈ సినిమా టీజర్ విడుదల చేశామంటే ఇది నా అదృష్టం. ఆనందంతో మాటలు రావడం లేదు. దీనిని నేను నమ్మలేక పోతున్నాను. ఈ కార్యక్రమాన్ని వేరే ఎక్కడ చేసినా ఇంత ఆనందం రాకపోవచ్చు. ఓదెల 2 ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇప్పటివరకు ప్రేక్షకులు నన్ను ఇలాంటి పాత్రలో చూడలేదు. ఈ సినిమాతో మా డైరెక్టర్, నిర్మాతలకు డబ్బుతో పుణ్యం కూడా రావాలని కోరుకుంటున్నాను.
Advertisement