మెగాస్టార్ తల్లి అంజనాదేవికి తీవ్ర అస్వస్థత

మెగాస్టార్ చిరంజీవి త‌ల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైయిన‌ట్లు తెలుస్తుంది.

Advertisement
Update:2025-02-21 14:44 IST

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యానట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబ‌స‌భ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. మ‌రోవైపు తల్లి అనారోగ్యం విషయం తెలిసి విజయవాడ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న‌ట్లు టాక్.

మెగాస్టార్ ప్రస్తుతం ప్ర‌స్తుతం దుబాయ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. భార్య సురేఖ‌తో క‌లిసి చిరు వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు అనంత‌రం దుబాయ్‌కి వెళ్లాడు. అయితే అంజ‌నాదేవి ప‌రిస్థితి తెలుసుకున్న చిరు వెంట‌నే హైదరాబాద్‌కు బ‌య‌లుదేరిన‌ట్లు తెలుస్తుంది. కొణిదెల వెంక‌ట‌రావును పెళ్లి చేసుకున్న అంజనాదేవి.. ఐదుగురికి జ‌న్మ‌నిచ్చింది. ముగ్గురు కొడుకులు చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతుళ్లు మాధవి, విజయ దుర్గ ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News