విమానంలో చిరు పెళ్లి రోజు వేడుక..ఆమె నా ధైర్యమన్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని విమానంలో ఘనంగా జరుపుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతుల పెళ్లి రోజు అత్యంత సన్నిహితుల మధ్య విమానంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా చిరు తన సతీమణికి విషెస్ చెబుతూ సురేఖ లాంటి జీవిత భాగస్వామి దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నా బలం, నేనప్పుడు అదృష్టంగా భావిస్తున్నా. నా యాంకర్ కూడా. ఆమె ఉనికి నిరంతరం ఓదార్పునిస్తుంది. ఆమె నా ధైర్యం. నా నమ్మకం ఆమె అంటే నాకేంత ఇష్టమో తెలియజేసేందుకు ఈ క్షణాలను సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
మీ అద్భుతమైన శుభాకాంక్షల కోసం స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు! ఆశీర్వదించండి!" అంటూ చిరు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ఫ్లైట్ లో దుబాయ్ వెళ్తూ పెళ్లి రోజును ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ వేడుకలలో అక్కినేని నాగార్జునతో పాటు అతడి భార్య అమల తదితరులు ఉన్నారు.