'మ్యాడ్‌2' టీజర్‌ విడుదల..ఫ్యాన్స్‌కు పూనకలే

మ్యాడ్‌ స్క్కేర్‌`(మ్యాడ్‌ 2) పేరుతో దీన్ని రూపొందించారు. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్‌ తాజాగా విడుదలైంది.

Advertisement
Update:2025-02-25 17:44 IST

అభిమానులను రెట్టింపు వినోదాన్ని 'మ్యాడ్‌2' సినిమాతో పంచేందుకు సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, రామ్‌ నితిన్‌ సిద్దంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుంది. ఇదే కాంబినేషన్‌లోనే రూపొందిన హిట్‌ ఫిల్మ్‌ ‘మ్యాడ్‌ (2023)’కు సీక్వెల్‌గా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ పేరుతో రూపొందుతోంది. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

మార్చి 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. గతంలో వచ్చిన మ్యాడ్‌ సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్'ను మేకర్స్‌ ప్రకటించారు. సినీ అభిమానులంతా ఈ మూవీ అప్డేట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా 'మ్యాడ్ స్క్వేర్' నుంచి టీజర్ విడుదలైంది.


Full View


Tags:    
Advertisement

Similar News