మనతో మనం ఒంటరిగా ఉండటం భయంకరం
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో యుగంలో మూడు రోజులు ఫోన్‌కు దూరంగా ఉన్నట్లు సమంత పోస్ట్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటారు.విహారయాత్రల గురించి షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో యుగంలో మూడు రోజులు ఫోన్‌కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఆ అనుభవాన్ని తన ఇన్‌స్టాలో సేర్ చేశారు. 'మూడు రోజులు మౌనంగా ఉన్నాను. ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను మనతో మనం ఒంటరిగా ఉండటం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది. కానీ, ఇలా మౌనంగా ఉండటాన్ని నేను ఇష్టపడుతాను. మిలియన్‌సార్లు ఇలా ఇంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి' అంటూ అభిమానులకు సూచనలు ఇచ్చారు. తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సమంత ప్రస్తుతం ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.
తన మాజీ భర్త నాగచైతన్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రస్తుత లైఫ్ గురించి, తన విడాకుల గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత ఇలా పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. తెరపై మహిళా ప్రాధాన్య కథలో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. మరోవైపు ఓటీటీ వేదికగా భిన్నమైన కథలతో సత్తా చూపెడుతున్నారు. ఆమె, వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించిన 'సిటడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌కు తాజాగా ఐకానిక్ గోల్డ్ అవార్డు దక్కింది. ఉత్తమ వెబ్‌సిరీస్‌గా అవార్డు గెలుచుకున్నది. ప్రస్తుతం 'రక్త్‌బ్రహ్మాండ్'తో బిజిగా ఉన్నారు.