ఏపీలో.... కరోనా కట్టడికి బహుముఖ వ్యూహం

కరోనా విస్తృతి నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు అమలు చేస్తోంది. అనుమానిత కేసులు పెరుగుతున్న కారణంగా.. విజయవాడ, తిరుపతి లోనే అధునాతన వైరాలజీ ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. కాకినాడలో మరో ల్యాబ్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా.. రాష్ట్ర ప్రజలకు ఇవి ఉపయోగకరం కానున్నాయి. ఎవరైనా కరోనా అనుమానితులు ఉంటే.. 5 నుంచి 6 గంటల్లోపు ఫలితాలు వచ్చేలా పరీక్షలు జరగనున్నాయి. గతంలో పూణేలో మాత్రమే వైరాలజీ ల్యాబ్ ఉండేది. చైనాలో కరోనా విజృభించాక […]

Advertisement
Update:2020-03-16 06:17 IST

కరోనా విస్తృతి నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు అమలు చేస్తోంది. అనుమానిత కేసులు పెరుగుతున్న కారణంగా.. విజయవాడ, తిరుపతి లోనే అధునాతన వైరాలజీ ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. కాకినాడలో మరో ల్యాబ్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా.. రాష్ట్ర ప్రజలకు ఇవి ఉపయోగకరం కానున్నాయి. ఎవరైనా కరోనా అనుమానితులు ఉంటే.. 5 నుంచి 6 గంటల్లోపు ఫలితాలు వచ్చేలా పరీక్షలు జరగనున్నాయి.

గతంలో పూణేలో మాత్రమే వైరాలజీ ల్యాబ్ ఉండేది. చైనాలో కరోనా విజృభించాక దేశ వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 60 కి పైగా ల్యాబ్ లు నెలకొల్పారు. అందులో రెండు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.

రియల్ టైం పాలిమిరేజ్ చైన్ రియాక్షన్ అనే పరికరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులను అత్యవసరంగా కేటాయించింది. ఈ పరికరం ఆధారంగానే కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత సమర్థంగా చేసే వీలు డాక్టర్లకు కలగనుంది.

ఇక… 13 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు వారికి అధికారాలు అప్పగించారు. జాయింట్ కలెక్టర్లకు తోడుగా వీరు పని చేయనున్నారు. అలాగే.. బోధనాసుపత్రుల్లో 255 పడకలు, 55 వెంటిలేటర్లు, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 132 బెడ్లు, 32 వెంటిలేటర్లు, ప్రైవేటు హాస్పిటళ్లలో 469 బెడ్లు, 589 వెంటిలేటర్లను అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఈ ఏర్పాట్ల ద్వారా.. ముందుగా అనుమానితులను గుర్తించి.. వారిని హాస్పిటళ్లకు తరలించడం, విదేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా పెంచడం, సత్వర చికిత్స అందించి కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టడం లాంటి ప్రణాళికలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News