అనుమతి లేకుండా.... ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు !

కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొందరు హైదరాబాద్ లో నివాసం ఉంటుండడం సరికాదని.. రాష్ట్ర విభజన తర్వాత ఆరేళ్లు గడిచిందని ఆమె గుర్తు చేస్తున్నారు. వారాంతాల్లో హైదరాబాద్ లో ఉండడం.. కాదంటే ఢిల్లీకి వెళ్లడం లాంటి చర్యలను ఇక ఆపాల్సిందిగా ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అతి సున్నితమైన పరిస్థితులు ఉండడానికి తోడు.. స్థానిక సంస్థల ఎన్నికల […]

Advertisement
Update:2020-03-15 13:35 IST

కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొందరు హైదరాబాద్ లో నివాసం ఉంటుండడం సరికాదని.. రాష్ట్ర విభజన తర్వాత ఆరేళ్లు గడిచిందని ఆమె గుర్తు చేస్తున్నారు. వారాంతాల్లో హైదరాబాద్ లో ఉండడం.. కాదంటే ఢిల్లీకి వెళ్లడం లాంటి చర్యలను ఇక ఆపాల్సిందిగా ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో అతి సున్నితమైన పరిస్థితులు ఉండడానికి తోడు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇంటెలిజెన్స్ చీఫ్ రివ్యూ సమావేశానికి అందుబాటులో లేరని సీఎంకు సమాచారం వచ్చినట్టుగా తెలిసింది. అక్కడ పరిశీలన మొదలు పెట్టిన సీఎస్.. చాలా మంది అధికారులు హైదరాబాద్.. కాదంటే ఢిల్లీకి వెళ్తున్నారని గుర్తించారు. పరిస్థితి మారాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కొందరు ఉన్నతాధికారులు కార్యాలయాలకు రాకుండా.. క్యాంపు కార్యాలయాల్లో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న తీరును కూడా సీఎస్ తప్పుబట్టారు. అలాంటి వారిలో కొందరికి మెమోలు కూడా జారీ చేసినట్టు తెలిసింది. ఇకపై.. కార్యాలయాలకు కచ్చితంగా హాజరు కావాలని.. ఎవరూ అనుమతి లేకుండా రాష్ట్రం విడిచి వెళ్లొద్దని.. ప్రభుత్వానికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశాలను సీఎస్ జారీ చేశారు.

ఇన్నాళ్లూ కాస్త అటూ ఇటూగా విధులు కానిచ్చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లు.. ఇప్పుడు టైమ్ టు టైమ్.. అప్ టు డేట్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    
Advertisement

Similar News