థియేట‌ర్లు, షూటింగ్‌లు బంద్‌... స‌హ‌క‌రించాల‌ని చిరంజీవి విన‌తి

కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చిరంజీవి ప్ర‌శంసించారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లతో వెంట‌నే త‌న సినిమా షూటింగ్‌ను నిలిపివేసిన‌ట్లు చెప్పారు. ఆచార్య సినిమాను వాయిదా వేసిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా కరోనా నివార‌ణ‌కు చర్యలు తీసుకుంటుంద‌ని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలివేయకుండా అందరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే […]

Advertisement
Update:2020-03-15 03:08 IST

కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చిరంజీవి ప్ర‌శంసించారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లతో వెంట‌నే త‌న సినిమా షూటింగ్‌ను నిలిపివేసిన‌ట్లు చెప్పారు. ఆచార్య సినిమాను వాయిదా వేసిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఏపీ ప్రభుత్వం కూడా కరోనా నివార‌ణ‌కు చర్యలు తీసుకుంటుంద‌ని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలివేయకుండా అందరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. తెలంగాణ

ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కొన్ని ముందస్తు నివారణా చర్యలు ప్రారంభించార‌ని చెప్పారు.

సినిమా షూటింగ్స్ లో కూడా పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంటుంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదావేస్తే బాగుంటుందని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోన్న త‌న సినిమా షూటింగ్ ని వాయిదా వేసిన‌ట్లు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News