మాట నెగ్గించుకున్న బైరెడ్డి.... నందికొట్కూరులో రాజీ ఫార్ములా !
స్థానిక సంస్థల ఎన్నికల వేళ నందికొట్కూరులో ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్ధర్ మధ్య తీవ్రమైన ఫైట్ నడిచింది. తనకు గౌరవం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఆర్దర్ విమర్శలకు దిగారు. దీనికి ప్రతిగా బైరెడ్డి కూడా ఎన్నికల ముందు వచ్చినవారికి వర్గం ఉంటుందా? అని గట్టి కౌంటర్లు ఇచ్చారు. దీంతో అధిష్టానం, జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. నందికొట్కూరు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు […]
స్థానిక సంస్థల ఎన్నికల వేళ నందికొట్కూరులో ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్ధర్ మధ్య తీవ్రమైన ఫైట్ నడిచింది. తనకు గౌరవం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఆర్దర్ విమర్శలకు దిగారు. దీనికి ప్రతిగా బైరెడ్డి కూడా ఎన్నికల ముందు వచ్చినవారికి వర్గం ఉంటుందా? అని గట్టి కౌంటర్లు ఇచ్చారు. దీంతో అధిష్టానం, జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు.
నందికొట్కూరు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి తన వర్గం అభ్యర్థులకు మూడు మండలాల్లో బీ ఫారాలు కావాలని ఎమ్మెల్యే ప్రయత్నాలు చేసారు. అయితే సిద్దార్థరెడ్డి మాత్రం రెండు మండలాలు మాత్రమే ఇస్తామని పట్టుబట్టారు. పాములపాడు, జుపాడుబంగ్లా రెండు మండలాలతోనే సరిపెట్టుకోవాలని పెద్దలు సూచించారు. మొదట్లో ఆందోళన చేసిన ఆర్ధర్ వర్గం…తర్వాత రెండు మండలాలతో సరిపెట్టుకుంది.
ఆర్దర్ రోజురోజుకు గ్రూప్ వార్‌తో ముందుకు పోవడం గమనించిన సిద్దార్థ రెడ్డి చివరకు ఓ వ్యూహాంతో ఆయనకు చెక్ పెట్టారు. నిన్నటి వరకు తాను అనుకున్నదే జరగాలనే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యే ఆర్ధర్… మాజీ ఎమ్మెల్యే ఐజయ్య వైసీపీ కండువా కప్పుకోవడంతో వెనక్కి తగ్గారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మూడు మండలాలకు సంబంధించి అభ్యర్థులకు బీ ఫారాలు కావాలని పట్టుబట్టిన ఎమ్మెల్యేకి నాయకులు హామీ ఇవ్వలేదు. దీంతో రాజవిహర్‌లో ధర్నా చేయాలని ఆలోచించిన ఎమ్మెల్యేకి ఐజయ్య చేరారన్న విషయం తెలియడంతో ధర్నాను విరమించుకున్నట్లు తెలిసింది.
నందికొట్కూరు మున్సిపాలిటీలో 29 వార్డుల్లో ఎమ్మెల్యేకు ఆరు వార్డులు మాత్రమే ఇస్తామని సిద్ధార్థరెడ్డి వర్గం ప్రతిపాదన పెట్టిందట. ఇక్కడ 15 సీట్లు కావాలని ఎమ్మెల్యే అడుగుతున్నారట. ఇక్కడ పంచాయతీ కూడా ఆరుసీట్లతో తేలిపోయే అవకాశం ఉంది. మొత్తానికి సిద్దార్థరెడ్డి పంతం నెగ్గించుకున్నాడని నందికొట్కూరులో ప్రచారం జరుగుతోంది.