ఏపీపై కెనడా ఆసక్తి.... పెట్టుబడులకు ఉత్సాహం

కెనడా కాన్సుల్ జనరల్.. నికోల్ గిరార్డ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అమలవుతున్న పథకాలను ప్రశంసించారు. ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆంధ్రాలో ప్రభావ వంతమైన నాయకత్వం ఉందని అభినందించిన నికోల్ గిరార్డ్.. కెనడాతో ఈ ప్రాంత సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ […]

Advertisement
Update:2020-03-12 03:13 IST

కెనడా కాన్సుల్ జనరల్.. నికోల్ గిరార్డ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అమలవుతున్న పథకాలను ప్రశంసించారు. ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆంధ్రాలో ప్రభావ వంతమైన నాయకత్వం ఉందని అభినందించిన నికోల్ గిరార్డ్.. కెనడాతో ఈ ప్రాంత సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

అంతేకాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ లో.. పెట్టుబడులకు ఉన్న అవకాశాలనూ నికోల్ గిరార్డ్ పరిశీలించారు. ఏపీతో వ్యాపార సంబంధాలు పెంచుకునేందుకు.. పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించినట్టు నికోల్ గిరార్డ్ వెల్లడించారు.

ఇక.. భారత్ తో ఇప్పటికే కెనడాకు సన్నిహిత సంబధాలు ఉన్న విషయాన్ని నికోల్ గుర్తు చేశారు. విస్తృత వాణిజ్యం, పర్యావరణ మార్పులపై కలిసి పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. ఇరువురి మధ్య మరిన్ని విషయాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది.

రాష్ట్రంలో సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత, పథకాల అమలు తీరును మాత్రమే కాకుండా.. వాటిల్లో భాగస్వామ్యమయ్యే అవకాశాలను నికోల్ కు సీఎం జగన్ వివరించినట్టు సమాచారం. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా.. రాష్ట్రానికి మేలు జరిగే దిశగా.. జగన్ ఈ భేటీని వినియోగించుకున్నట్టుగా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News