ల‌క్ష్మణ్ ప్లేస్‌లో సంజ‌య్... గులాబీ కోట‌పైనే గురి !

తెలంగాణ బీజేపీ కొత్త అధ్య‌క్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని అధ్యక్షుడుగా నియమించారు. కొత్త అధ్య‌క్షుడి రాక‌తో బీజేపీ నేత‌లు తెలంగాణపై ఫోక‌స్ పెట్ట‌బోతున్నార‌నే సంకేతాలు పంపారు. చివ‌రి వ‌ర‌కు ల‌క్ష్మ‌ణ్‌ను మ‌రోసారి నియ‌మిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న వైపే అధిష్టానం మొగ్గుతుంద‌ని బీజేపీ ఆఫీస్ నుంచి లీకులు వ‌చ్చాయి. అయితే సంజ‌య్‌, ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య ఫైట్ చివ‌రి వ‌ర‌కూ న‌డిచింది. ఆర్ఎస్ఎస్‌, యువ నాయ‌క‌త్వం వైపు మొగ్గుచూపి అధిష్టానం సంజ‌య్‌కు ప‌గ్గాలు అప్ప‌జెప్పింది. క‌రీంన‌గర్ కార్పొరేట‌ర్ […]

Advertisement
Update:2020-03-12 02:24 IST

తెలంగాణ బీజేపీ కొత్త అధ్య‌క్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని అధ్యక్షుడుగా నియమించారు. కొత్త అధ్య‌క్షుడి రాక‌తో బీజేపీ నేత‌లు తెలంగాణపై ఫోక‌స్ పెట్ట‌బోతున్నార‌నే సంకేతాలు పంపారు. చివ‌రి వ‌ర‌కు ల‌క్ష్మ‌ణ్‌ను మ‌రోసారి నియ‌మిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న వైపే అధిష్టానం మొగ్గుతుంద‌ని బీజేపీ ఆఫీస్ నుంచి లీకులు వ‌చ్చాయి. అయితే సంజ‌య్‌, ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య ఫైట్ చివ‌రి వ‌ర‌కూ న‌డిచింది. ఆర్ఎస్ఎస్‌, యువ నాయ‌క‌త్వం వైపు మొగ్గుచూపి అధిష్టానం సంజ‌య్‌కు ప‌గ్గాలు అప్ప‌జెప్పింది.

క‌రీంన‌గర్ కార్పొరేట‌ర్ నుంచి ఎంపీ స్థాయికి సంజ‌య్ ఎదిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంజయ్, ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం కష్టపడ్డారు. ఈ క్రమంలోనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సంజయ్‌కు కరీంనగర్ ఎంపీగా విజ‌యం సాధించారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ దాటి బీజేపీ విస్త‌ర‌ణ‌కు పార్టీ పెద్ద‌లు ప్ర‌ణాళిక‌లు రచిస్తున్నారు. ఇప్ప‌టికే గ్రేట‌ర్ నుంచి ద‌త్తాత్రేయ‌, కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్, ఇంద్రసేనారెడ్డి పార్టీ అధ్య‌క్షులుగా ప‌నిచేశారు. ఒక్క విద్యాసాగ‌ర్ రావు మాత్రమే నాన్ గ్రేట‌ర్ ప్రెసిడెంట్‌. తెలంగాణ‌లో ఇటీవ‌ల నాలుగు ఎంపీ సీట్లు బీజేపీ గెలిచింది. వాటిలో ఉత్త‌ర‌ తెలంగాణ‌లో మూడు పార్ల‌మెంట్ సీట్లు ఉన్నాయి. క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌. మొన్న‌టి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా ఇక్క‌డ మంచి సీట్లు సాధించింది. దీంతో ఇక్క‌డ పార్టీ గ్రోత్‌కు స్కోప్ ఉంద‌ని బీజేపీ అధిష్టానం గ్ర‌హించింది. అందుకే ఉత్త‌ర తెలంగాణ‌కు చెందిన సంజ‌య్‌కు ప్ర‌యారిటీ ఇచ్చింది.

గ్రేట‌ర్‌లో బీజేపీకి అంతో ఇంతో ప‌ట్టు ఉంది. ఇక్క‌డ కిష‌న్‌రెడ్డి కేంద్ర‌మంత్రిగా ఉన్నారు. ఉత్త‌ర తెలంగాణ గులాబీ కోట‌. అక్క‌డ కోట‌ను కూల్చాలంటే ఆ జిల్లాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి. బీసీ నినాదంతో యువ ఎంపీగా ఉన్న సంజ‌య్‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. క‌రీంన‌గ‌ర్‌తో పాటు పార్టీ విస్త‌ర‌ణ‌ను ఆయ‌న ఎలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తారనేది సంజ‌య్ ముందున్న పెద్ద స‌వాల్‌.

Tags:    
Advertisement

Similar News