మహిళల శరీరాకృతిని కామెంట్ చేసినా లైంగిక వేధింపే

కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Advertisement
Update:2025-01-08 14:02 IST

మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల శరీరాకృతి గురించి తప్పుడు కామెంట్లు చేయడం అంటే వారి గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమే అని పేర్కొన్నది. దాన్ని లైంగిక వేధింపుల నేరంగా పరిగణించాలని తెలిపింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసిన ఓ మహిళా స్టాపర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2013 నుంచి ఆయన తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఆ తర్వాత అభ్యంతరకర మెసేజ్‌లు, వాయిస్‌ కాల్స్‌ చేసేవారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన శరీరాకృతిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలతో తనను వేధింపులకు గురిచేశారని తెలిపారు. దీంతో పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

అయితే, ఈ కేసు కొట్టివేయాలంటూ సదరు మాజీ ఉద్యోగి కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమెకు అందమైన శరీరం ఉందన్న ఉద్దేశంలోనే తాను మాట్లాడానని, దీన్ని లైంగిక వేధింపుల నేరంగా చూడొద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కానీ, అతడి విజ్ఞప్తిని కోర్టును తోసిపుచ్చింది. మహిళల శరీరాకృతిపై కామెంట్లు చేయడం కూడా వేధింపుల కిందికే వస్తుందని పేర్కొంటూ ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. 

Tags:    
Advertisement

Similar News