"జగన్ జీ.. థాంక్యూ.. ఏపీ అభివృద్ధి కోసం పని చేస్తా"
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన పరిమల్ నత్వానీ.. త్వరలో రాజ్యసభ సభ్యుడు కాబోతున్న సంగతి తెలిసిందే. తనకు దక్కిన ఈ అవకాశంపై నత్వానీ చాలా ఆనందంగా ఉన్నారు. తనపై నమ్మకంతో అవకాశాన్ని కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన నత్వానీ.. జగన్ ను స్వయంగా కలిశారు. ముఖేష్ అంబానీ వ్యక్తిగత విజ్ఞప్తిపై.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ […]
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన పరిమల్ నత్వానీ.. త్వరలో రాజ్యసభ సభ్యుడు కాబోతున్న సంగతి తెలిసిందే. తనకు దక్కిన ఈ అవకాశంపై నత్వానీ చాలా ఆనందంగా ఉన్నారు. తనపై నమ్మకంతో అవకాశాన్ని కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన నత్వానీ.. జగన్ ను స్వయంగా కలిశారు.
ముఖేష్ అంబానీ వ్యక్తిగత విజ్ఞప్తిపై.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వడం.. పార్టీ తరఫున బరిలో ఉన్న నలుగురిలో చోటు దక్కించుకోవడంపై.. నత్వానీ హర్షం వ్యక్తం చేశారు. జగన్ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఆయన ఏ పని చెప్పినా చేస్తానని స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్రానికి వస్తానని.. సీఎంను కలిసి అభివృద్ధి ప్రణాళికపై చర్చిస్తానని అన్నారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించడంలో.. చొరవ చూపిస్తానని నత్వానీ చెప్పారు. ఇప్పటికే లోక్ సభలో ఉన్న 22 మంది ఎంపీలకు ఆయన కూడా తోడవడం.. పైగా, సీనియర్ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా రాజ్యసభ సభ్యులు అవుతుండడంపై.. అధికార పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాయి.
ఇకపై.. జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున మరింత గట్టిగా గొంతుక వినిపించే అవకాశం దక్కిందని సంబరపడుతున్నాయి.