చంద్రబాబుపై మరో భారీ అవినీతి ఆరోపణ!

టీడీపీ అధినేత చంద్రబాబుపై.. మరో భారీ అవినీతి ఆరోపణ వెలుగుచూసింది. వైసీపీ అగ్ర నాయకుడు విజయసాయిరెడ్డి.. ఆధారాన్ని చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకుతో గతంలో.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు లాలూచీ పడ్డారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన దాదాపు 1300 కోట్ల రూపాయల నిధులను.. ఆ బ్యాంకులో పెట్టి కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ విషయంలో వెంటనే స్పందించారని.. డిపాజిట్లను వెనక్కు తీసుకుని […]

Advertisement
Update:2020-03-08 03:22 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై.. మరో భారీ అవినీతి ఆరోపణ వెలుగుచూసింది. వైసీపీ అగ్ర నాయకుడు విజయసాయిరెడ్డి.. ఆధారాన్ని చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకుతో గతంలో.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు లాలూచీ పడ్డారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన దాదాపు 1300 కోట్ల రూపాయల నిధులను.. ఆ బ్యాంకులో పెట్టి కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు.

ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ విషయంలో వెంటనే స్పందించారని.. డిపాజిట్లను వెనక్కు తీసుకుని రాష్ట్రానికి మేలు చేశారని విజయసాయి చెప్పారు. అంతే కాదు.. అదే యస్ బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం నిధులనూ దోచిపెట్టాడని ఆరోపించారు. ఇంకెన్ని ఉన్నాయో.. అనే ప్రశ్నను కూడా వేశారు. ఆంధ్రా రాజకీయ వర్గాలు.. ఈ ఆరోపణలపైనే చర్చోపచర్చలు చేసుకుంటున్నాయి.

విజయసాయి ఆరోపణలకు చంద్రబాబు.. ఏమని స్పందిస్తారు? ఆయన పుత్రరత్నం చినబాబు ఎలా స్పందిస్తారు..? అసలు ఈ ఆరోపణలు, విమర్శలకు వారిద్దరూ ఏమని ట్వీట్ చేస్తారు.. అన్నదే.. అంతా మాట్లాడుకుంటున్నారు. విచారణకు సై అంటారా.. లేదంటే ఇందులోనూ ఏదో “ఫ్యాబ్రికేటెడ్” లాజిక్ తీస్తారా.. అని ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ మీ విశ్వసనీయత నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశమని గుర్తుచేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News