బీజేపీ, వైసీపీ మధ్య ట్విట్టర్ వార్

ఏపీ సీఎం జగన్, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో స్నేహ పూర్వక సంబంధాలను నెరుపుతున్నారు. మోడీ, అమిత్ షాలతో కలిసి సఖ్యత మెయింటేన్ చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అధికార వైసీపీతో ఏపీ బీజేపీ శాఖ మాత్రం ఘర్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తోంది. జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. గురువారం బీజేపీ ఏపీ శాఖ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ‘ఆంధ్రప్రదేశ్, వైసీపీ, 150 […]

Advertisement
Update:2020-03-07 08:52 IST

ఏపీ సీఎం జగన్, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో స్నేహ పూర్వక సంబంధాలను నెరుపుతున్నారు. మోడీ, అమిత్ షాలతో కలిసి సఖ్యత మెయింటేన్ చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

అధికార వైసీపీతో ఏపీ బీజేపీ శాఖ మాత్రం ఘర్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తోంది. జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.

గురువారం బీజేపీ ఏపీ శాఖ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ‘ఆంధ్రప్రదేశ్, వైసీపీ, 150 ఎమ్మెల్యేలు-22 ఎంపీలు.. కానీ అభివృద్ధి మాత్రం లేదు’ అంటూ ఎద్దేవా చేసింది.

ఈ వ్యాఖ్యలు వైసీపీ అభిమానులను, నేతలను ఆగ్రహానికి గురిచేశాయి. బీజేపీ ట్వీట్ పై తీవ్రంగా స్పందించారు. ‘ఏపీ బీజేపీ ప్రస్తుతం అన్ని రకాల నేరస్థులకు , బ్యాంకు దోపిడీదారులకు ఆశ్రయం కల్పించింది. వారే మీ సహచరులు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ తెచ్చుకోని మీరు ఏపీలో ఉనికిలోనే లేరు’ అంటూ బీజేపీని వైసీపీ ట్విట్టర్ ద్వారా కడిగిపారేసింది.

ఇక వైసీపీ, బీజేపీ ఫైట్ పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. వైసీపీ అభివృద్ధి చేయలేదని తిట్టిపోశారు. ఇక వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, రాపాక వరప్రసాద్ లు కూడా బీజేపీపై ట్వీట్ వార్ చేస్తున్నారు. వైసీపీ అభిమానులు కూడా బీజేపీ, దాని మద్దతుదారులపై విరుచుకుపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News