స్థానిక... ఎన్నికల వేళ టీడీపీలో కొత్త చిచ్చు !
తెలుగుదేశంలో మళ్లీ చిచ్చు మొదలైంది. నియోజకవర్గాల ఇంచార్జ్ ల నియామకం ఆ పార్టీలో రగడకు కారణమవుతోంది. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ వంగలపూడి అనితను తిరిగి నియమించారు. మొన్నటి ఎన్నికల్లో ఆమెను పశ్చిమగోదారి జిల్లా కోవ్వూరుకు పంపించారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. దీంతో తిరిగి ఆమెను పాయకరావు పేట ఇంచార్జ్‌గా వేశారు. ఇక్కడ సమస్య ఏం రాలేదు. కానీ కోవ్వూరుకు తిరిగి జవహర్ ను నియమించకపోవడంపై ఆయన అలిగారట. స్థానిక సంస్థల ఎన్నికల వేళ […]
తెలుగుదేశంలో మళ్లీ చిచ్చు మొదలైంది. నియోజకవర్గాల ఇంచార్జ్ ల నియామకం ఆ పార్టీలో రగడకు కారణమవుతోంది. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ వంగలపూడి అనితను తిరిగి నియమించారు.
మొన్నటి ఎన్నికల్లో ఆమెను పశ్చిమగోదారి జిల్లా కోవ్వూరుకు పంపించారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. దీంతో తిరిగి ఆమెను పాయకరావు పేట ఇంచార్జ్‌గా వేశారు. ఇక్కడ సమస్య ఏం రాలేదు. కానీ కోవ్వూరుకు తిరిగి జవహర్ ను నియమించకపోవడంపై ఆయన అలిగారట. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇలా చేయడం ఏమిటనేది జవహర్ ప్రశ్న.
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్‌గా మాకినేని పెదరత్తయ్య నియమాకం అక్కడ హీట్ రాజేసింది. ఆయనను ఇంచార్జ్‌గా వేయడాన్ని లోకల్ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇంచార్జ్ గా నియమించడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే చంద్రబాబు దగ్గర తేల్చుకుంటామని పలువురు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు.
రిజర్వ్‌డ్ నియోజకవర్గానికి ఓసీని ఇంచార్జ్‌గా ఎలా వేస్తారనేది అందరి ప్రశ్న. బీసీ రిజర్వేషన్లు తగ్గాయని గోల చేస్తున్న చంద్రబాబు…ఓసీని ఎలా ఇంచార్జ్‌గా నియమించారని ఆ పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.
ఇటు సత్తెనపల్లి ఇంచార్జ్‌గా వంగవీటి రాధాను వేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ కూడా గొడవలు జరిగే అవకాశం కన్పిస్తోంది. ఎన్నికల తర్వాత కోడెల వర్గంతో రాయపాటి ఢీ అంటే ఢీ అన్నారు. కోడెలను నరసరావుపేట పంపించి… తనకు ఇంచార్జ్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కోడెలను తప్పించేందుకు రాయపాటికి చంద్రబాబు మద్దతు ఇచ్చారట. ఇప్పుడు కొత్తగా వంగవీటిని విజయవాడ నుంచి తీసుకురావడం ఇక్కడి నేతలకు నచ్చడం లేదట.
ఇటు గన్నవరం ఇంచార్జ్‌పై ఇంకా తేల్చలేదు. జడ్పీ మాజీ ఛైర్మన్ గద్దె అనురాధను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చాలా మంది నేతలు పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారట. ఇలా అనేక నియోజక వర్గాల్లో ఇంచార్జ్ ల నియామకం పార్టీలో చిచ్చు రేపుతోంది. మొత్తానికి ఇంచార్జ్‌ల నియామకం తెలుగుదేశంలో మరో కుదుపుకు కారణం కాబోతుందని తెలుస్తోంది.