నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చేందుకు ఆ హీరో చాలా కష్టపడుతున్నాడట
ఒక్క సినిమా హిట్ అయితే చాలు కోట్లకు కోట్ల కలెక్షన్లు. డబ్బు. స్టార్ హీరోలకు అయితే చెప్పలేనంత ఆదాయం వస్తుంది. ఇన్ కం టాక్స్ కు చూపించేది తక్కువే. ఇతర మార్గాలకు మళ్లించేది ఎక్కువ. అందుకే తరచుగా సినీ తారల సినిమాలు హిట్ అయినప్పుడు వారి మీద ఐటీ రైడ్స్ జరుగుతుంటాయి. పరిశ్రమలోని ఇతరులతో పోల్చినప్పుడు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు నల్లధనం (బ్లాక్ మనీ) సమస్యలను ఎదుర్కొంటారనే టాక్ ఉంది. ఈ బ్లాక్ మనీని ఎలా […]
ఒక్క సినిమా హిట్ అయితే చాలు కోట్లకు కోట్ల కలెక్షన్లు. డబ్బు. స్టార్ హీరోలకు అయితే చెప్పలేనంత ఆదాయం వస్తుంది. ఇన్ కం టాక్స్ కు చూపించేది తక్కువే. ఇతర మార్గాలకు మళ్లించేది ఎక్కువ. అందుకే తరచుగా సినీ తారల సినిమాలు హిట్ అయినప్పుడు వారి మీద ఐటీ రైడ్స్ జరుగుతుంటాయి. పరిశ్రమలోని ఇతరులతో పోల్చినప్పుడు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు నల్లధనం (బ్లాక్ మనీ) సమస్యలను ఎదుర్కొంటారనే టాక్ ఉంది. ఈ బ్లాక్ మనీని ఎలా పెట్టుబడి పెట్టాలి. గమ్యానికి ఎలా రవాణా చేయాలి? ఇవన్నీ వారు ఎదుర్కొనే సమస్యలు.
అయితే ఐటీ అధికారుల భయంతో టాలీవుడ్ ప్రముఖులు వారి బ్లాక్ మనీ లావాదేవీలను తగ్గించారని తెలిసింది. కానీ పూర్తిగా నివారించడం లేదట.. ఒక టాప్ స్టార్ భారీ మొత్తంలో నల్లధనాన్ని కూడబెట్టినట్టు సమాచారం. దీన్ని తక్షణమే తెల్లగా మార్చడం అంత ఈజీ కావడం లేదట.. ఈ హీరో ఆలస్యంగా హిట్ చిత్రాలు చేస్తున్నాడు. ఇతడు తరుచుగా సెలవులకు విదేశాలకు వెళ్తున్నాడు. అతడికి, సినిమా, కుటుంబం తప్ప మరొక ద్యాస లేదు. డబ్బు విలువ బాగా తెలిసిన ఈ హీరో ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడట. అందుకే కూడబెట్టిన ఈ సొమ్మును రియల్ ఎస్టేట్ కోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. తాజాగా ఈ హీరో నల్లధనాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని యోచిస్తున్నాడట.
బ్లాక్ మనీని.. వైట్ గా మార్చడానికి నమ్మకమైన బినామీలు, ఇతర మార్గాల కోసం చూస్తున్నట్టుగా చెబుతున్నారు.