భారత్ ను ఊరిస్తున్న ప్రపంచకప్ ఫైనల్స్ బెర్త్

సిడ్నీ వేదికగా మరికాసేపట్లో సెమీస్ సమరం 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ లో హాటే ఫేవరెట్ జట్లలో ఒకటైన భారత్ కీలక సమరానికి సిద్ధమయ్యింది. ఐదుజట్ల గ్రూప్ – ఏ లీగ్ లో నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గి సెమీఫైనల్స్ కు అర్హత సంపాదించిన భారత్…నాకౌట్ రౌండ్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈమ్యాచ్ లో నెగ్గినజట్టుకే ఫైనల్స్ చేరే అవకాశం ఉంది. భారత్ కు నాకౌట్ […]

Advertisement
Update:2020-03-05 02:30 IST
  • సిడ్నీ వేదికగా మరికాసేపట్లో సెమీస్ సమరం

2020 మహిళా టీ-20 ప్రపంచకప్ లో హాటే ఫేవరెట్ జట్లలో ఒకటైన భారత్ కీలక సమరానికి సిద్ధమయ్యింది. ఐదుజట్ల గ్రూప్ – ఏ లీగ్ లో నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గి సెమీఫైనల్స్ కు అర్హత సంపాదించిన భారత్…నాకౌట్ రౌండ్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈమ్యాచ్ లో నెగ్గినజట్టుకే ఫైనల్స్ చేరే అవకాశం ఉంది.

భారత్ కు నాకౌట్ టెన్షన్…

ప్రపంచ క్రికెట్ టోర్నీలలో సెమీఫైనల్స్, ఫైనల్స్ లాంటి కీలకమ్యాచ్ ల్లో బోల్తా కొట్టడం భారతజట్లకు సాంప్రదాయ బలహీనతగా ఉంటూ వస్తోంది. ఇటీవలేముగిసిన అండర్ -19 ప్రపంచ కప్ లో భారత కుర్రాళ్లు సెమీస్ వరకూ వరుస విజయాలు సాధించిన బంగ్లాదేశ్ తో ముగిసిన టైటిల్ ఫైట్ లో పరాజయం పొందడం, గత ఏడాది ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన విరాట్ సేన…సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో కంగుతినడం లాంటి చేదుఅనుభవాలు భారత క్రికెట్ ను వెంటాడుతున్నాయి.

ప్రస్తుత మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లను అధిగమించిన భారత్.. సెమీఫైనల్స్ నాకౌట్ సమరంలో మాత్రం ఇంగ్లండ్ లాంటి ప్రమాదకరమైన జట్టును ఎదుర్కొనబోతోంది.

ఆ నలుగురే కీలకం…

భారత్ ఫైనల్స్ చేరాలంటే…డాషింగ్ ఓపెనర్లు స్మృతిమంధానా- షఫాలీ వర్మ జోడీ చక్కటి ఆరంభాన్ని ఇవ్వాల్సి ఉంది. అంతేకాదు…మరో యంగ్ గన్ జెమీమా రోడ్రిగేస్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు…స్పిన్ జాదూ పూనమ్ యాదవ్ సైతం స్థాయికి తగ్గట్టుగా ఆడాల్సి ఉంది.

ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆడిన ముక్కోణపు టోర్నీలో భారత్- ఇంగ్లండ్ జట్లు రెండుసార్లు తలపడి చెరో విజయం నమోదుచేయడం ద్వారా సమఉజ్జీలుగా నిలవడంతో.. ప్రస్తుత సెమీస్ సమరంలో రెండుజట్లకూ సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిలకడగా, స్థాయికి తగ్గట్టుగా రాణించినజట్టు మాత్రమే విజేతగా నిలువగలుగుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు ప్రపంచకప్ ఫైనల్స్ చేరడానికి…. ఇంతకుమించిన గొప్ప అవకాశం మరొకటిలేదు, రాదు.

Tags:    
Advertisement

Similar News