చిరంజీవి సపోర్ట్ వైసీపీకా? జనసేనకా? నాగబాబు క్లారిటీ

ఓవైపు తమ్ముడు , జనసేనాని పవన్ కళ్యాణ్… వైసీపీ అధినేత, సీఎం జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఆయన అన్నయ్య మాత్రం ఆ మధ్య ఏపీ సీఎం జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటి నుంచి మొదలైంది లొల్లి. చిరంజీవి సపోర్టు ఆయన తమ్ముడు జనసేనకు అని వాళ్లు…. కాదు కాదు వైసీపీకేనని వీళ్లు చిరంజీవిని ఓన్ చేసుకుంటున్నారు. తాజాగా మరో రూమర్ ప్రచారంలోకి వచ్చేసింది. ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక […]

Advertisement
Update:2020-03-05 06:02 IST

ఓవైపు తమ్ముడు , జనసేనాని పవన్ కళ్యాణ్… వైసీపీ అధినేత, సీఎం జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఆయన అన్నయ్య మాత్రం ఆ మధ్య ఏపీ సీఎం జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అప్పటి నుంచి మొదలైంది లొల్లి. చిరంజీవి సపోర్టు ఆయన తమ్ముడు జనసేనకు అని వాళ్లు…. కాదు కాదు వైసీపీకేనని వీళ్లు చిరంజీవిని ఓన్ చేసుకుంటున్నారు.

తాజాగా మరో రూమర్ ప్రచారంలోకి వచ్చేసింది. ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక సీటును చిరంజీవికి సీఎం జగన్ ఇవ్వబోతున్నారని ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఇంకేముందు తమ్ముడు పవన్ కు షాకిస్తున్న చిరంజీవి.. వైసీపీలోకి చిరంజీవి అంటూ హెడ్డింగ్ లతో సోషల్‌ మీడియాలో హీట్ పెంచారు.

ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్ నాగబాబు తాజాగా చిరంజీవికి రాజ్యసభ సీటుపై క్లారిటీ ఇచ్చారు. యూట్యూబ్ లో ఈ మేరకు వీడియో విడుదల చేశాడు. చిరంజీవి రాజకీయాలను వదిలేశాడని.. ఆయన ఏ పార్టీకి సపోర్టు చేయాలనుకోవడం లేదని తెలిపారు.

వైసీపీకి, జనసేనకు చిరంజీవి సమాన దూరంగా ఉంటున్నారని.. ఆయన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించవద్దని వివరణ ఇచ్చారు. పవన్ కు ఇబ్బంది కలిగించకూడదనుకుంటే తాను జనసేనలో ఉండకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నారని తెలిపారు.

పవన్ కోసం చిరంజీవి తన రాజకీయ భవిష్యత్ వదిలేశాడని మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. వైసీపీ నుంచి రాజ్యసభకు వెళుతున్నారన్నది తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు.

Tags:    
Advertisement

Similar News