ఆసియాకప్ పై భారత్- పాక్ వివాదం

భారత్ ది ఓ మాట…పాక్ ది మరోమాట! 2020 ఆసియాకప్ క్రికెట్ టోర్నీని ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై భారత్, పాక్ క్రికెట్ బోర్డులు చెరోమాట మాట్లాడుతున్నాయి. పాకిస్తాన్ ఆతిథ్యంలో జరగాల్సిన ఈటోర్నీలో తాము భద్రతకారణాలతో పాల్గొనబోమని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే తటస్థ వేదికలో నిర్వహిస్తే పాల్గొనటానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. దుబాయ్ వేదికగా ఆసియాకప్ ను నిర్వహిస్తారని, భారత ,పాక్ జట్లు రెండు పాల్గొంటాయని సౌరవ్ గంగూలీ […]

Advertisement
Update:2020-03-01 01:00 IST
  • భారత్ ది ఓ మాట…పాక్ ది మరోమాట!

2020 ఆసియాకప్ క్రికెట్ టోర్నీని ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై భారత్, పాక్ క్రికెట్ బోర్డులు చెరోమాట మాట్లాడుతున్నాయి. పాకిస్తాన్ ఆతిథ్యంలో జరగాల్సిన ఈటోర్నీలో తాము భద్రతకారణాలతో పాల్గొనబోమని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే తటస్థ వేదికలో నిర్వహిస్తే పాల్గొనటానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు.

దుబాయ్ వేదికగా ఆసియాకప్ ను నిర్వహిస్తారని, భారత ,పాక్ జట్లు రెండు పాల్గొంటాయని సౌరవ్ గంగూలీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పేచీకి దిగింది.

తమదేశంలో జరిగే ఆసియాకప్ ను వేరేచోట ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించింది. ఆసియాకప్ ను ఎక్కడ నిర్వహించేదీ నిర్ణయించేదీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కానీ.. భారత క్రికెట్ బోర్డు కానేకాదని తేల్చి చెప్పింది.

అక్టోబర్లో జరిగే టీ-20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకొని…ఆసియాకప్ ను టీ-20 ఫార్మాట్లో నిర్వహిస్తారా? లేక…వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తారో తేలాల్సి ఉంది.

మార్చి 3న దుబాయ్ వేదికగా జరిగే ఆసియా క్రికెట్ మండలి సమావేశంలో వేదికతో పాటు…ఫార్మాట్ ను సైతం ఖరారు చేసే అవకాశం ఉంది.

ఆసియా క్రికెట్ మండలి తీసుకోవాల్సిన నిర్ణయాలను భారత క్రికెట్ బోర్డు ఎలా తీసుకోగలదంటూ పాక్ క్రికెట్ బోర్డు వాదనకు దిగింది.

ఆసియాకప్ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అప్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

Tags:    
Advertisement

Similar News