ఈ ముగ్గురు... ఎరక్కపోయి ఇరుక్కుపోయారు

ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయ్యింది… అంగట్లో అన్నీ ఉన్నాయ్ అల్లుడి నోట్లో శని ఉంది.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. ఇలాంటి పోలికలన్నీ.. ఈ ముగ్గురుకీ అతికినట్టు సరిపోతున్నాయి. కారణాలు ఏవైనా.. టీడీపీని వదిలి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లిన ఈ ముగ్గురి పరిస్థితి.. ఇప్పుడు ఎవరికైనా చెప్పుకుందామన్నా.. వారికి వారే ఇబ్బందిగా ఫీలయ్యేలా మారిపోయింది. ఈ ముగ్గురు నేతలు ఎవరో కాదు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, సీనియర్ రాజకీయ […]

Advertisement
Update:2020-02-26 02:09 IST

ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయ్యింది… అంగట్లో అన్నీ ఉన్నాయ్ అల్లుడి నోట్లో శని ఉంది.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. ఇలాంటి పోలికలన్నీ.. ఈ ముగ్గురుకీ అతికినట్టు సరిపోతున్నాయి. కారణాలు ఏవైనా.. టీడీపీని వదిలి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లిన ఈ ముగ్గురి పరిస్థితి.. ఇప్పుడు ఎవరికైనా చెప్పుకుందామన్నా.. వారికి వారే ఇబ్బందిగా ఫీలయ్యేలా మారిపోయింది.

ఈ ముగ్గురు నేతలు ఎవరో కాదు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, సీనియర్ రాజకీయ నాయకుడు టీజీ వెంకటేష్. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి ఎంపీలుగా కొనసాగుతున్న ఈ ముగ్గురికి వచ్చే సారి కొనసాగింపు ఉంటుందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడైతే కాలం సరిగా కలిసిరావడం లేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన వీరికి.. ఇప్పుడు తమ సొంత పార్టీ బీజేపీనే సరైన గౌరవం ఇవ్వడం లేదు.

ముడు రాజధానులను వ్యతిరేకిస్తూ వీళ్లు మాట్లాడుతుంటే.. కేంద్రం మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చట్ట సభల సాక్షిగా తేల్చి చెప్పేసింది. తర్వాత కూడా ఏ సమావేశం నిర్వహించినా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు తోడు.. జీవీఎల్ నరసింహారావు, పురంధేశ్వరి అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇది చూసి.. ఈ ముగ్గురూ కక్కలేక మింగలేక.. బీజేపీలో మిన్నకుండి పోతున్నట్టుగా సమాచారం అందుతోంది.

ఇటీవల సుజనా చౌదరి ఆస్తులపై ఓ బ్యాంకు పేపర్ నోటీసు ఇవ్వడం.. రాయలసీమ విషయంలో మాట్లాడుతున్న టీజీ వెంకటేష్ కు అంతగా మద్దతు లేకపోవడం.. సీఎం రమేష్ కు అసలు ప్రాధాన్యతే దక్కకపోవడం.. ఈ ముగ్గురు ఇప్పుడు ఏ పార్టీకి మారాలన్నా.. ఆఖరికి తిరిగి టీడీపీలోకి రావాలన్నా.. అంతగా అనుకూల వాతావరణం లేకపోడవం.. ఇలా ఏ దారి చూసినా సుడిగుండాల గోదారే అన్నట్టుగా ఈ ముగ్గురూ ఫీలైపోతున్నట్టు రాజకీయ వర్గాలకు సమాచారం అందుతోంది.

ఈ ముగ్గురి రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో.. వారు పని చేస్తున్న బీజేపీ.. ఆ ముగ్గురి తల రాతను నడ్డా చేతి రాత ఎలా రాస్తుందో.. అంతా మోడీ షా కే ఎరుక.

Tags:    
Advertisement

Similar News